deccan.com

deccan.com

యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..

టీటీడీ బోర్డు త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు ఏర్పాట్లు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు…

మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం..

ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. విషం చిమ్ముతున్న మూసీకి చికిత్స చేస్తాం.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఇక్క‌డివారు మూసీలోనే పాతరేస్తారు. ప్ర‌తిప‌క్షాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు.. ఒకనాడు మంచి నీటిని అందించి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన‌ మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి…

ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ జ‌న్మ‌దిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా మోదీ బర్త్ డే…

మంచిర్యాల గురుకులాల్లో విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల, ప్రజాతంత్ర,నవంబర్‌ 08 :  ‌వసతుల లేమితో గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు జంకుతున్నారు. పలు గురుకులాల్లో విద్యార్థులు హాస్టల్‌ ‌వదిలి ఇంటిబాట పడుతున్నారు.  తాజాగా మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కాగా,…

ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్టాన్ని ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన నివాసంలో నాగర్‌ ‌కర్నూల్‌ ఎం‌పీ డాక్టర్‌ ‌మల్లురవి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

‌ప్రభుత్వ పాలన తీరు మారడం లేదు

Former Minister Harish Rao

గురుకులాల్లో పరిస్థితి మరీ అధ్వానం : మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 08 : ‌గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం…

బీసీలను ప్రలోభపెట్టేందుకే కుల గణన

బీసీలను కేవలం రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుల గణనను తెరపైకి  తీసుకొచ్చిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనే తప్పదాలు చేశారని మండిపడ్డారు. నెహ్రూ విధానాలతో ఆర్థిక, సామాజిక, విద్య,…

సమగ్ర సర్వేతో సామాజిక వివక్ష రూపుమాపు

మాజీ ఎంపీ వి.హనుమంతరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 8 : ‌హైదరాబాద్‌: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి  రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సమ గ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బాగ్‌అం‌బర్‌పేటలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో…

వినియోగ దారుల హక్కులపై అవగాహన అవసరం

1987లో ఇండియన్‌ ‌లీగల్‌ అథారిటీస్‌ ‌యాక్ట్ అమలులోకి వచ్చిన రోజు జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరం నవంబర్‌ 9‌వ తేదీన భారతదేశం అంతటా జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటారు. 1995లో భారతదేశంలో తొలిసారిగా జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వేడుక దినోత్సవాన్ని ప్రారంభించింది. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించడానికి నేషనల్‌ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ ఏర్పాటు చేయబడింది. చట్టపరమైన అవగాహనను వ్యాప్తి చేయడం, నేర బాధితులకు పరిహారం అందించడం, లోక్‌ అదాలత్‌లను నిర్వహించడం దీని ఇతర లక్ష్యాలు. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం విధానాల ద్వారా వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారిస్తుంది. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడే. ప్రతిరోజు ఎన్నో వస్తువులు కొంటాం, సేవలు పొందుతుంటాం. మనం పొందేవన్ని మేలుచేసేవిగా వుండాలి. మేలుచేసేవి పొందడం ప్రతి ఒక్కరి హక్కు. అందుకుగాను ప్రభుత్వం వినియోగదారులకు రక్షణను కల్పిస్తుంది. వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాలు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వినియోగదారుల రక్షణ మండళ్ళు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సలహా సంఘాలు. వినియోగదారుల సంరక్షణ కేంద్రాలు తదితర వేదికలు వినియోగ దారునికి విన్నవించు కోవడానికి అందుబాటులో ఉన్నాయి. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోసపోతున్నారు. వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్‌ ‌మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ‌ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ‌ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ‌ఫోరమ్‌ ‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్‌ ‌యంత్రాంగంగా పని చేస్తాయి. జాతీయ స్థాయిలో సెంట్రల్‌ ‌కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది. జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ ‌చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. రాష్ట్ర లీగల్‌ ‌సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి. - రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494

నేడు జాతీయ న్యాయ సేవల దినోత్సవం 1987లో ఇండియన్‌ ‌లీగల్‌ అథారిటీస్‌ ‌యాక్ట్ అమలులోకి వచ్చిన రోజు జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరం నవంబర్‌ 9‌వ తేదీన భారతదేశం అంతటా జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటారు. 1995లో భారతదేశంలో తొలిసారిగా జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వేడుక దినోత్సవాన్ని…

అపార్‌ ‌కార్డు నమోదులో అపారమైన సమస్యలు

కేంద్రం తెచ్చిన అపార్‌ ‌కార్డు నమోదులో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. అపార్‌ ‌కార్డు నమోదు కోసం ఆధార్‌ ‌కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే నమోదు సమయంలో ఆధార్‌ ‌కార్డులో వివరాలు, అడ్మ్షిన్‌ ‌రిజిస్టర్‌, ‌యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్‌ ‌కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆధార్‌…