సంతోషమే పూర్తి బలం
సంతోషం సగం బలం ఆనాడు, సంతోషమే పూర్తి బలం ఈనాడు. సంతోష సాగరంలో ఈద డానికి నవ్య నరుడు విశ్వ ప్రయత్నం చేస్తూ, ఆనంద తీరాలు చేరడానికి డిజిటల్ యుగపు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. ఆనందమనే మానసిక భావన కలగడానికి అనేక మార్గాలు వెతుకుతున్న మానవుడు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు షికారీ అవుతున్నాడు.…
