NEWS

NEWS

పథకాలు ప్రకటించటంలో ఉన్న ఆరాటం అమలులో ఏది..?

ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ.. ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్నారు. గత ఏడాది దళిత బంధు పథకం ప్రకటించి, లక్షలో ఒక్కరి, ఇద్దరికి ఇచ్చి, దాని ఉసే మరిచారు. గత నెల రోజుల క్రితం అతి గొప్పగా బిసి కుల వృత్తులకు రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకానీ ప్రకటించారు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకాని కేసీఆర్ పునాదులు వేశాడు. కానీ సంక్షేమ పథకాలు ప్రకటించిన అంత వేగంగా, ఆ పథకాల అమలు లేకపోవడం చూస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పథకాలు అమలు చేయాలన్న చిత్త శుద్ధి ఉందా..? అన్న సందేహం కలుగుతుంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అతి గొప్పగా ప్రకటిస్తూ.. దళితుల్లో ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధి అయిన, ప్రభుత్వ ఉద్యోగైనా, వ్యాపారస్తుడైనా, భూమి ఉన్నా సరే, ప్రతి దళితునికి రూ.10 లక్షల నగదు బంధు ఇస్తానని ప్రకటించారు. అన్న విధంగానే కోటికో నూటికో ఒకరి, ఇద్దరికి తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చి ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ఆగ మేఘాల మీద బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష రూపాయల బంధు ప్రకటించినట్లుగానే, గత రెండు రోజుల క్రితం మైనార్టీలకు మైనార్టీ బంధును కూడా ఇస్తానన్న ప్రకటన రానే వచ్చింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇప్పుడే దళితులు, గిరిజనులు, బిసి, మైనార్టీలు గుర్తుకు రావడంపై  అనేక సందేశాలు కలుగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపు మాపడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే, కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తుంది. నిజానికి దళితుల్లో నూటికి 90 శాతంకు పైగా కడు బీదరికంలోనే ఉన్నారు. వారిని బీదరికం నుంచి బైట పడేయటానికి దళిత బంధు తేవడం హర్షణీయమే, కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని చూస్తుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఏ పథకమైన ముందుగా ఎలాంటి అసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహిస్తారు. అందుకు భిన్నంగా దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగస్తులు, తమ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చుకున్నారు. అంటే ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమతో పెట్టిన పథకం కాదన్న మాట.! ఓట్ల కోసం పెట్టిన పథకం అన్న మాట.! ప్రతి దళితుడికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అపోహలు, సందేహాలు లేవు కానీ, ముందుగా కడు బీదరికంలో ఉండి, ఎలాంటి ఆసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహించాలి. అందరికి ఇస్తాను అని అనడంలోనే కేసీఆర్ చిత్త శుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. అంటే ఒక్కరి, ఇద్దరికి రూ.10 లక్షలు ఇచ్చి, యావత్ దళిత సమాజాన్ని మోసం చేయలని కేసీఆర్ కుట్ర పన్నినట్లుగా ఉంది. ఇదే తరహాలో బిసి కుల వృతి దారులకు, మైనార్టీలకు రూ.లక్ష రూపాయల పథకం ఊరికి ఒక్కరు, ఇద్దరికి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఉంది. గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలు ప్రకటించి, నేడు వాటి ఊసే ఎత్తడం లేదు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి జాబితాలో  దళిత, బిసి, మైనార్టీ బంధు పథకాలు చేరుతాయన్న సందేశం కలుగుతుంది. బిసి బంధు ప్రకటించిన నెల రోజుల తరువాత విధి విధానాలు ప్రకటించి, దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజుల గడువు ఇవ్వడం ఏమిటి..? అంటే ఎవరు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉండకూడదని అనుకున్నారేమో..? అందుకే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజు గడువు ఇచ్చినట్లు ఉన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి దరఖాస్తుదారుడు కుల, ఆదాయ, ధృవ పత్రాలతో పాటు  రేషన్ కార్డు జత చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ లేనే లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కుల ధృవీకరణ పత్రం జారికి ఒక నెల గడువు, ఆదాయ ధృవీకరణ పత్రాల జారికి వారం రోజుల గడువు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పది రోజుల గడువులో బిసి కుల వృత్తి దారులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు. బిసి కుల వృత్తులు చేసుకునే వారిలో, మైనార్టీలలో అత్యధికులు నిరక్షరాశులు ఉంటారు. ప్రభుత్వం సూచించిన విధంగా వారం రోజులో ధృవ పత్రాలను పొంది, ఎలా దరఖాస్తు చేసుకుంటారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వానికి బిసి కులాలను మోసం చేయడం కోసమే, బిసి బంధు తెచ్చినట్లు కనిపిస్తుంది. బిసి బంధు ప్రకటనతో లక్షలాది మంది వారం రోజుల పాటు ఏంఅర్ఓ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన చాలా మంది కుల, ఆదాయ ధృవ పత్రాలు సాధించలేక పోయారు. ఇదే అదునుగా ఏంఅర్ఓ కార్యాలయ సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అందిన కాడికి దండుకొని కావలసిన వారికి ధృవ పత్రాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రకటిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందేలా విధి విధానాలను రూపకల్పన చేస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో చిత్త శుద్ధి లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికే సమయం ఇవ్వని ప్రభుత్వం అర్హులైన బిసి కులాలకు రూ.లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని నమ్మాలి. దళిత బంధు, బిసి కుల వృత్తులకు ఇచ్చే రూ.లక్ష రూపాయల సహాయం పథకం  మాదిరిగానే మైనార్టీ బంధు పథకం కూడా ప్రకటనలకే పరిమితం కానున్నట్లు ఉంది. దీనిని బట్టి చూస్తే, కేసీఆర్ మరోసారి ఓట్ల కోసం ఆగ మేఘాల మీద తీసుకువచ్చిన పథకాలు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదన్న సంగతి తేటతెల్లం అవుతున్నది.    బొల్లంపల్లి ఆంజనేయులు 9000099152

ఒకరోజు వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్రనేతలు

– మండువ రవీందర్‌రావు ఒకరోజు తేడాతో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు జాతీయస్థాయి  అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా, వీరిరాకతో వాతావరణం మరింత హోరెత్తే అవకాశముంది. దేశంలోని  రాజకీయ పార్టీలన్నీ కలిసి  తాజాగా  రెండు కూటములుగా విభజించబడ్డాయి. బిఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సిపి లాంటి ఒకటిరెండు పార్టీలు ఏ కూటమికి చెందనివిగా ఉన్నప్పటికీ…

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

లోక్‌ ‌సభలో నోటీసులు అందించిన కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌ కాంగ్రెస్‌  తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌ న్యూ దిల్లీ, జూలై 26 : మణిపూర్‌ అం‌శంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌, ‌భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ‌బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం…

60 ‌వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్సారెస్పీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద ఫ్లడ్‌ ‌రిమోట్‌ ‌కంట్రోల్‌…

జీహెచ్‌ఎం‌సీ అధికారి టేబుల్‌పై పామును..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతుతుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. దీంతో పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వొస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు వరద, మురుగునీరు ఇళ్లలోకి వొస్తుంది. ఆల్వాల్‌ ‌జీహెచ్‌ఎం‌సీ పరిధిలో ఇళ్లలోకి వరద నీరు…

30‌న కాంగ్రెస్‌ ‌పాలమూరు ప్రజా భేరి

విజయవంతం చేయడానికి హస్తం సన్నాహాలు హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇదే వేదికపై పార్టీలోకి జూపల్లితో సహా పలు చేరికలు సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌..‌ప్రజల్లోకి వెళ్లేందుకు హస్తం నేతల ప్లాన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా…

‌మూడు పార్టీలూ ఒక్క తాను ముక్కలే

నేటి నుంచి కిసాన్‌ ‌సేవా కేంద్రాలుగా ఎరువుల రిటెయిల్‌ ‌షాపులు రైతులకు అన్ని సేవలు ఒకే చోట లభ్యం నేడు రాష్ట్రంలోని 39 లక్షల రైతుల ఖాతాల్లో కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌డబ్బులు నేటి నుంచి ఒకే దేశం-ఒకే ఎరువు నినాదంతో ‘భారత్‌ ‌బ్రాండ్‌’ ఎరువులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

తడిసిముద్దైన ఓరుగల్లు నగరం

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అలుగు పారుతున్న చెరువులు ముంపులో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ దంచికొట్టిన వాన…రహదారులు ధ్వంసం..నిలిచిన రాకపోకలు వరంగల్‌/‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఓరుగల్లు నగరం తడిసిముద్దైంది. కుంటలు, చెరువులు పూర్తిగా నిండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలుగు పారుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు…

అస్సాంలో భార్య, అత్తామామలను హత్యచేసిన యువకుడు

గువహటి, జూలై 26 : ఒక యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకుని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నజీబుర్‌ ‌రెహమాన్‌ ‌బోరా(25) అనే వ్యక్తి ఇంజినీరింగ్‌ ‌పూర్తి…

రైతులకు శుభవార్త.. నేడు పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల!

న్యూ దిల్లీ, జూలై 26 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి (పీఎం-కిసాన్‌) ‌యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ ‌నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి. 2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్‌లో…