సమీరాలు

ప్రేమను కొలవడం విలువకట్టడం ఎలా సాధ్యం!? అది ఉద్వేగపు కెరటాల్తో ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో ఆకలి తరంగాల్తో ఘోషిస్తూనేవుంది బానిసత్వపు సముద్రం- ఇక ఉద్యమ అల్పపీడనంతో తప్పదు నిరసన తుఫాను!…నీ మనసు అయితేనేం వొక నిశ్చలమేఘం- ఆశయాల పవనాల్తో అది అవుతుంది జీవనాధార ధారల్ని కురిపించే తొలకరి రాగం… – డాక్టర్ కొత్వాలు అమరేంద్ర…






