NEWS

NEWS

తెలంగాణా కు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ

వికసించిన తెలుగు పద్మాలు! గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (2026) ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామ్ రెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమార స్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త కాగా, రామ్ రెడ్డి…

గాలించండి కొంచం

విద్వేషాల మనుషులు వెదజల్లే హాలాహలం నేడు సమాజమంతా ఏదో తెలియని కలకలం ద్వేష దూషణలతో పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రపంచం యుద్ధ మేఘాలతో గడగడ లాడుతుంది ప్రతి ఇంట్లోనూ శాంతి కపోతాలకై గాలించండి కొంచం -శ్రిష్టి శేషగిరి

జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…

శతకాలకే మకుటం అప్పాజోస్యుల ‘సుగుణాఢ్య శతకం’

ఒక్కొక్క శతకపద్యం ఒక్కోరీతిలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తుండటం అప్పాజోస్యుల శతకనిర్మాణ కౌశలం. ‘శతమును మించి సూర్యులును చంద్రులు నంతకుమించి మిన్నునం దతి రథులౌచు దీప్తకిరణాలి వసుంధర జిమ్మవచ్చు, త ద్ద్యుతి యిసుమంత లో నిరుల ద్రోలదు, సూరి వచో మరీచి హృ ద్గతమయి పూన్చులో వెలుగు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్’ పద్యంలో అనేకమంది సూర్యులు, చంద్రులు మింటనుంచి…

ఒక తరం నడిచిన నడక 

“మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను భుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం…

పండుగ‌ల సీజ‌న్‌లో  విందులు, వినోదాల‌తో జాగ్రత్త 

పెరుగుతున్న గుండె స‌మ‌స్య‌లు- దెబ్బ‌తింటున్న జీర్ణ‌వ్య‌వస్థ‌ – జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లే కార‌ణం -మితాహారం, త‌గినంత నిద్ర అవ‌స‌రం – కేర్ హాస్పిట‌ల్స్ వైద్యులు సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్ సమస్యలతో చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేర్ హాస్పిటల్స్…

సచివాలయంలో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా..!

మంత్రి కోమటిరెడ్డి ని చూస్తే జాలేస్తుంది…! “సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీఓ ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు..ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి…

గ్రామీణ గుండె చప్పుడు

“ఫజల్ రెహమాన్ జర్నలిజంలోకి వచ్చిన కాలం గ్రామీణ తెలంగాణలో మార్పులు మెల్లగా ప్రారంభమవుతున్న దశ. వ్యవసాయ రంగంలో సంక్షోభాలు, వలసలు, నిరుద్యోగం, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్న కాలం అది. ఈ పరిస్థితులన్నింటినీ ఆయన తన కథనాల్లో ప్రతిబింబించారు. రైతుల ఆత్మహత్యలు, పంట నష్టాలు, ఎరువుల కొరత వంటి అంశాలపై ఆయన రాసిన కథనాలు అప్పట్లో…

ఈ ఏడాదిలో అయినా కాలుష్యంపై  దృష్టిపెడదామా ???

ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి “పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. గత పదేళ్లుగా వాతావరణంలో వేడి పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం…

పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…