బండి సంజయ్ పాదయాత్రలో రాళ్లదాడి
బండి సంజయ్ పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు,…
బీఆర్ కేఆర్ భవన్‌లో పతాకావిష్కరణ చేసిన సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు, సీనియర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.నేటి సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లను పరిశిలించిన సిఎస్‌భారత స్వతంత్ర…
ఆరుగురు ఎపి పోలీసులకు మెడల్స్
న్యూ దిల్లీ, అగస్టు 15 : ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అందుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. పోలీస్ ట్రైనింగ్ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ పీ…
ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి
పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ…
అవినీతి, బంధుప్రీతి..దేశానికి అత్యంత ప్రమాదకరం
ఈ రెండు సవాళ్ల ప్రజలు కలిసి పోరాడాలి అర్హులు, ప్రతిభావంతులకే అవకాశాలు దక్కాలి నారీ శక్తిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలి ఏది చేసినా ఇండియా ఫస్ట్ అన్న సంకల్పం రావాలి ఐదు తీర్మానాలు, నవ సంకల్పంతో ముందుకు అభివృద్ధి చెందిన భారత్‌గా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కలసి ముందడుగు వేస్తేనే సమరయోధుల…
‘‘అజాత శత్రువు అటల్ జీ’’ నేడు వాజ్ పేయి వర్ధంతి
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు…
స్వాతంత్య్ర అమృత్యోత్సవ వేళ గాంధీ విలవల అమలు – ఒక విశ్లేషణ
‘‘చాలా కాలం మతసామరస్యం దేశంలో ఫరిడవిల్లింది. దేశ స్వాతంత్య్ర అనంతరం హిందూ ముస్లింల మధ్య జరిగిన అతి భయానకమైన హింస కోణంలో చూస్తే దేశంలో మత ఘర్షణలు విపరీతంగా జరిగి మరో పాకిస్తాన్ లాగా మరో విభజనకు దారి తీస్తుందని భయం ఉండేది. కానీ చాలా కాలం పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు ఇతర మతస్తులకు…
ఇంకా సవాళ్లు అనేకం .. !
దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మువన్నెల జెండా రెపరెపలాడింది. ఆకాశాన్ని ముదాడుతుందా అన్న రీతిలో త్రివర్ణ పతకాలు ఎగురవేశారు. ప్రజలంతా తమవంతుగా దేశభక్తిని చాటారు. నేతలు కూడా జెండాలు ఆవిష్కరించారు. ఊరేవాడా త్రివర్ణపతాకం ఎగిరింది. ప్రజలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటారు. మనమంతా ఒక్కటే అని…
