– ఈనెల 29వ తేదీ వరకు గడువు
– ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తులు పంపాలి
– ఎంజెపీ కార్యదర్శి సైదులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (హాన్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి ఈనెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్ బైపీసీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు టీజీ ఈఏపీసెట్-2025లో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం https://ug.mjptbcwreis.net లేదా https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000లు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదన్నారు. ఈనెల 29లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు రుసుము రూ.1,000 ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాలని సైదులు సూచించారు. అభ్యర్థుల ఎంపిక ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆఫీస్ పని దినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు 040-23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి లేదా mjpadmissioncell@gmail.comకు మెయిల్ పంపాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





