దుర్గాదేవీగా విజయవాడ అమ్మవారు

ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవరోజు గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. దుర్ఘతలను పోగొట్టే దుర్గాదేవిని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *