ఆమె
అమరత్వం
ఆవలిలో
నాటిన
విత్తనాలాంటివి
మట్టి పొరల్ని
చీల్చుకొని
మహావృక్షాలుగా
ఎదిగి వస్తాయి
ఆమె
అమరత్వం
ఆకులోదాగిన
పత్రహరితం లాంటిది
సూర్యోదయ కిరణాల తాకిడితో
అమాంతం ప్రాణవాయువును
పుట్టిస్తుంది
ఆమె
అమరత్వం
ఆకాశంలో
చుక్కల వంటిది
చీకటిని చీల్చి
వెలుగునుజి
ప్రసరింప చేస్తుంది
– శాఖమూరి రవి