– నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్న మంత్రులు
– హరీష్ రావు లాగా అవినీతి మాకు తెలియదు
– రవాణా శాఖ మంత్రి పొన్నం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 12: సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తమ శాఖల్లో తప్పు జరిగిందనేందుకు ఎలాంటి విచారణకు అయినా తాము దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ఉన్నామని పేర్కొన్నారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లో పారదర్శకంగా మంత్రులుగా సంబంధం లేకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కు తాము నిర్ణయాధికారం ఇచ్చామని గుర్తు చేశారు. అయితే అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడి ఆయన.. తన స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ పక్షాన చెబుతున్నానని.. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. పేదలకు విద్య, నాణ్యమైన ఆహారం అందాలనే ఆలోచన తమకు ఉందని తెలిపారు. అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. ఈ అవినీతిపై చర్చించేందుకు రే డేట్ టైమ్ ఫిక్స్ చేయండి.. చర్చిద్దామంటూ హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. గురుకుల విద్యార్థుల షూస్, యూనిఫాం, బుక్స్ టెండర్‌లో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న హరీష్ రావు ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. మొత్తం టెండర్ విలువే రూ.687 కోట్లు అని వివరించారు. రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. వారు అవినీతి చేసినట్లే తాము చేశామని అనుకుంటున్నారా? అంటూ బీఆర్‌ఎస్ నేతను మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఏడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం తాము మంచి ఆలోచన చేస్తే హరీశ్ రావుకు అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. రు గురుకులాలకు ఒక్క కొత్త భవనం అయినా నిర్మించారా?.. ఎస్సీ విద్యార్థుల కోసం ఒక్క హాస్టల్ భవనం అయినా కట్టించారా? అని హరీశ్ రావుకు ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ హరీశ్ రావుకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలకు కూడా కొంత శాతం ప్రొక్యూర్‌మెంట్‌కు అవకాశం ఇచ్చామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




