– రాజ్యాంగ విలువలను కించపరచడమే
-రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్
– ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 :కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమేనని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు అత్యంత నీచానికి పాల్పడుతున్నారు.. రేవంత్ హయంలో గాంధీ భవన్ బూతుల అడ్డాగా మార్చారన్నారు. సెక్యులరిజం భావనను కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేస్తున్నారన్నారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని అసత్యపు ప్రచారం చేస్తున్నారు.. హిందువులను అగౌరవపరుస్తున్నారు.. శివతత్వాన్ని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ చండీ యాగం చేశారు.. ప్రజలు చెడిపోవడం కోసం పూజలు ఎన్నడూ చేయలేదు అని స్పష్టం చేశారు. హరీశ్ రావు అనేక అంశాల మీద ప్రభుత్వం పై పోరాడుతున్నారు.. అందుకే ఆయన మీద కక్ష గట్టి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీష్ రావు శివమొగ్గ మూకాంబికా ఆలయాన్ని సందర్శించుకుంటే క్షుద్ర పూజలు చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మూకాంబికా దేవి శక్తి స్వరూపిణి .. అమ్మ వారిని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డే అద్దంకి, సామ రామ్మోహన్ రెడ్డి తో క్షుద్ర పూజలు అని మాట్లాడిస్తున్నారు.. శివమొగ్గ ఆది శంకరాచార్యులు తిరగాడిన అత్యంత పవిత్ర ప్రాంతం. తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ తో ఉన్నారు ఆయన కూడా మూకాంబికా దేవాలయం వెళ్లారు. మరి విజయ్ కూడా క్షుద్ర పూజలు చేశారా ? రాహుల్ గాంధి ,సిద్దరామయ్య ,శివకుమార్ కూడా అనేక గుడులు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా క్షుద్రపూజలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఉత్తమ్, భట్టిల ప్రభావం తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలు చేశారని అనగలం.. హరీష్ రావు పై క్షుద్ర పూజల ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రముఖులు మాట్లాడిన గాంధీ భవన్ వేదికను క్షుద్ర పూజలంటూ హీనంగా మార్చినందుకు సిగ్గుపడాలి.. తొండల భాష, పేగుల భాష నుంచి క్షుద్ర పూజల స్థాయికి దిగజార్చారన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని మరచి క్షుద్ర పూజలు అని చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీ స్థాయిని దిగజార్చారన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నేతలు గోసుల శ్రీనివాస యాదవ్, అభిలాష్ రంగినేని, కార్తీక్ రాయల పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




