సీఎంను కలిసిన జూపల్లి, వాకిటి, పలువురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.