గ్రీన్ కాలనీలలో రేడియేషన్ మంట
సైనికపురి : కాసులకు కక్కుర్తి పడి పచ్చని కుటుంబాల మధ్య ఇప్పుడో అప్పుడో కూలిపోయే ఇంటిపై రేడియేషన్ మంట రగిలిస్తున్నారు. దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల కిందట కట్టిన కట్టడంపై టన్నుల కొద్దీ బరువు ఉంది. ఎప్పుడు కూలుతుందో అని పలుమార్లు జీహెచ్ యంసి కాప్రా కార్యాలయానికి ఫిర్యాదు చేసిన కనికరం లేదు. సైనిక్ పురి సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ లో సెల్ టవర్ ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది. దానికి సరి అయిన అనుమతులు లేవు. అప్పటి ట్రాయ్ నిబంధనల ప్రకారం సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు చుట్టుపక్కల నివాసం ఉన్న నిర్వాసితుల దగ్గర అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా అక్రమంగా సెల్ టవర్ ఏర్పాటు చేయడమైనది.
కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ కోసం పర్మిషన్ తీసుకుని ఇప్పుడు మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్ గా అప్ గ్రేడ్ చేయడమైనది. సెల్ టవర్ రేడియేషన్ వలన చుట్టుపక్కల నివసించే వారికి తరచూ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూరోలాజికల్, మెదడు, డిమెన్షియా, సైకిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్ని సార్లు కాలనీ సంక్షేమ సంఘానికి, జి హెచ్ ఎం సి కి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. పురాతన భవనాలపై టన్నుల కొద్దీ బరువున్న సెల్ టవర్లు తీసివేయడం అందరికి శ్రేయస్కరం.
ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాల పై ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. నిషేధిత ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించిన వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగేశ్వర రావు, అధ్యక్షుడు డాక్టర్ ఎం. సురేష్ బాబు, కాలనీ వాసులు మనోహర రావు, డా ఆశాదేవి, నిషా రాథోడ్, డా. అఖిల మిత్ర, సృజన, డా సంఘమిత్ర తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.