– నాలుగు నెలలుగా సమాచారం లేక ఆందోళన
– శంషాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: దుబాయ్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. కొద్ది నెలలుగా ఆమె నుంచి ఫోన్ కాల్స్ కానీ, సమాచారం కానీ లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాత బస్తీకి చెందిన ఓ కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. తన కుటుంబాన్ని పోషించేందుకు వైద్య విద్య పూర్తి చేసిన ఓ యువతి (24) ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లింది. గత ఏడాది ఆగస్టులో వెళ్లిన ఆమె అక్కడి ఓ హాస్పిటల్లో విధుల్లో చేరింది. దుబాయ్ వెళ్లిన తర్వాత యువతి కొంతకాలంపాటు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేది. అయితే నాలుగు నెలలుగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఆమె రెండు ఫోన్లకు కాల్ చేసినా పనిచేయడం లేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు దుబాయ్ లో ఉన్న తెలిసిన వారి ద్వారా ఆరా తీశారు. అయినప్పటికీ యువతి ఆచూకీ లభించలేదు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శంషాబాద్ లోని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




