– దేశంలో ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తాం
– రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు
– సీజేపీ నేత అభిజిత్ దీప్కే స్పష్టీకరణ
ముంబై, ఆగస్ట్ 5 : జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో డియాతో మాట్లాడిన దీప్కే, జూలై 29 నుంచి రాంచీలో జరుగుతున్న నిరవధిక ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని చెప్పారు. తాము తప్పకుండా జార్ఖండ్ వెళ్తామని, అక్కడి విద్యార్థుల ప్రతీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం సీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా, ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తుందని దీప్కే వెల్లడించారు. న్యాయవ్యవస్థ, రాజకీయాలు, డియా, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ప్రజల విశ్వాసం తగ్గుతోందని, వీటిలో జవాబుదారీతనం తీసుకురావడమే తమ ఉద్యమ లక్ష్యమని చెప్పారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా