– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి
– 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవీ?
– ప్రశ్నించే గొంతుకలపై ఏసీబీ, సీఐడీలతో అక్రమ కేసులు..
– ఉద్యోగులకు అండగా బీఆర్ఎస్.. ఎవరూ భయపడొద్దు
” మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 30: ప్రపంచ దేశాల్లో ప్రతిభ చాటుతూ రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థు లను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులకు కనీసం దరఖాస్తు రాయడం కూడా రాదని వ్యాఖ్యానించడం ద్వారా ఉపాధ్యాయ లోకాన్నే అవమానించారని, ముఖ్యమంత్రి వెం టనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇంజినీ రింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించిన “జన చైతన్య యాత్ర”లో పాల్గొని వారికి సంఘీభావం ప్రక టించిన హరీశ్‌రావు మాట్లాడుతూ, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధా నం (ఓపీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్ఎస్, ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శిం చారు. ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఉద్యో గులు అన్ని వేదికలపై విజ్ఞప్తులు చేసినా ప్రభు త్వం స్పందించకపోవడంతోనే రోడ్డెక్కాల్సిన పరి స్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేసే ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఏవీ నిలవలేదని, ఉద్యోగుల ఆవేదనకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నిధులను కూడా ఎనిమిది నెలల పాటు ప్రభుత్వం జమ చేయలేదని, బీఆర్ఎస్ అసెం బ్లీలో నిలదీయడంతోనే వాటిని చెల్లించడం ప్రా రంభించిందని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, మెగా డీఎస్సీ హామీ కూడా అమ లు కాలేదని.. విద్యాశాఖలో ఇన్ని సమస్యలు ఉం డగా వాటిని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వి ద్యార్థులను, ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ విచారణలతో అణిచివేసే ప్రయత్నం చే స్తోందని ఆరోపించిన హరీశ్‌రావు, ఉద్యోగులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమ స్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే సభను స్తంభింపజేసైనా వారి హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు సహా ఉద్యోగుల అన్ని న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పూర్తి అండదండలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




