- కాణిపాకం ఇవోపై బదిలీవేటు
చిత్తూరు, అక్టోబర్ 8 : అభిషేకం టికెట్ ధరను భారీగా పెంచి వివాదానికి తెరలేపిన కాణిపాకం ఆలయ ఇఒ సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన ఇఒగా కర్నూలులో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను ఇన్‌ఛార్జి ఇఒగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనరు హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కాణిపాకం ఆలయానికి ఎఫ్ఎసిగా విధులు నిర్వహిస్తున్న రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనరు ఎంవి సురేష్‌బాబును ఎఫ్ఎసి బాధ్యతల నుంచి తొలగించారు.
రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరను రూ.700 నుంచి రూ.5 వేలకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో యాత్రికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఇఒను అక్కడ నుంచి తప్పించారు. దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించి టిక్కెట్ ధరలను పెంచడంపై మండిపడింది. ఎవరిని సంప్రదించి టిక్కెట్ రేట్లు పెంచారని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు.




