కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : 9సంవత్సరాల కాలంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం కందుకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ,రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో 100 కోట్లతో అభివృద్ధి పర్చామని ఆమె తెలిపారు.కేసీఆర్ ముందు చూపుగా పలురాకాలగా అభివృద్ధిని అందించడంతోపాటు ప్రజల భాగోవులను పట్టించుకున్న ఏకైక ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు.రాష్ట్రంలోని రైతుల కోసం ఎడతెరిపి లేకుండా కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆమె వెల్లడించారు.పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘనత కేసీఆర్దే అన్నారు.వచ్చే ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆమె తెలియజేశారు.రంగారెడ్డి జిల్లాలో తన హాయంలో మరింత అభివృద్ధి పరుస్తానని ఆమె తెలిపారు.