317 ‌జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే  కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్‌ ‌పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్‌ ‌విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది ఉద్యోగులు కొన్ని యూనియన్‌ ‌సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా ఇలాంటి అంశాలు బదిలీలు ప్రమోషన్లకు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయా అని సందేహాలు బదిలీలు ప్రమోషన్లకై నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగుల్లో లేకపోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం కొత్త  జిల్లాలు ఏర్పాటు జిల్లాల్లో పరిపాలన సౌలభ్యం కొరకు ఉద్యోగాల కేటాయింపులు ఉద్యోగస్తుల విధివిధానాలకు సంబంధించిన జీఓ లు మార్పులు చేర్పులు ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వసాధారణంగా జరిగే ప్రక్రియలే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పూర్వపు జిల్లాలను విస్తారణగా కొన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడం వల్ల అప్పుడున్న జిల్లాలు పెద్ద మొత్తంలో ఉండగా ఉద్యోగస్తులందరూ మొత్తం ఒక జిల్లాను స్థానికతగాని భావించి ఉద్యోగం పొందినారు .జిల్లా క్యాడర్‌ అయిన ఉపాధ్యాయ ఉద్యోగాలు ఈ కోవకు చెందినవే అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆలోచనతో కొంతమంది ఉపాధ్యాయులు దానిని వ్యతిరేకించినప్పటికీ చాల వరకు ఉపాధ్యాయులు జీఓ ప్రకారమే వారు ఎంచుకున్న ఆప్షన్స్ ‌ను బట్టి కేటాయించబడిన జిల్లాలకు వెళ్లి తమ విధి నిర్వహణ నిర్వహిస్తున్నారు.

జీఓ చర్చ మళ్లీ ఎందుకు మొద•• వస్తుంది…
ఒక జిల్లా ఐదు జిల్లాలు విడిపోయిన సందర్భాల్లో అందరూ జిల్లాలను ఎంచుకునే క్రమంలో సీనియార్టీ మెరిట్‌ ‌డీఎస్సీలో పొందిన మెరిట్‌ ‌ర్యాంక్‌ ‌ప్రకారం ఆప్షన్‌ ‌ఫార్మస్ ఇచ్చినప్పటికీ కొంతమందికి అనుకున్నా జిల్లాలో పోస్టింగ్‌ ‌రాకపోవడంతో ఉన్న జిల్లా కాకుండా పక్క జిల్లాకు వెళ్ళమన్న భావన ఉన్నవారు లేకపోలేదు.ఒకప్పుడు కొత్త జిల్లాలు మొత్తంగా ఒకే గొడుగు కిందనే స్థానికతగా ఉండి ఉద్యోగం సంపాదించుకున్న ఉపాధ్యాయులు కొత్త జిల్లాలు స్థానికత కాదనే భావన ఏర్పరచుకోవడం 317జీఓ పుణ్యమే అనిపిస్తుంది. కొత్త జిల్లాలుగా విభజన అనంతరం జీఓ 317 ప్రకారం సీనియర్లకు తామనుకున్న జిల్లా రావడం సాధారణమే. ఒకవేళ ఉద్యోగస్తులందరూ ఒకే జిల్లా వైపే మొగ్గుచూపుతే కొత్తగా ఏర్పడ్డ మిగతా జిల్లాల్లో ఉద్యోగాలు ఖాలీ గా ఉండే అవకాశం లేకపోలేదు .ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగాలను క్యాడర్‌ ‌ను కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్ని జిల్లాలకు పంచడం జరిగింది. ప్రధానంగా ఉన్న జిల్లా స్పౌజ్‌ ‌విషయంలో ఉద్యోగుల్లో భార్యాభర్తలు ఒకే చోట విధులు నిర్వహించేందుకు ఈ జీఓ కొంత నష్టం కలిగిందని అనుకుంటున్నా వారు లేకపోలేదు.ఒక జిల్లాలో ఒకరు వేరే  జిల్లాలో మరొకరు ఉండిపోవలసివస్తున్న  భావన వారిలో ఉండి పోయింది.

అడ్డంకులు లేకుండా బదిలీ ప్రమోషన్లు జరుగుతాయా..
ఇటీవల ప్రభుత్వం బదిలీ ప్రమోషన్ల ప్రకటనతో మళ్లీ ముందుకొచ్చిన 317 జీఓ ద్వారా గతంలో బదిలీ అయిన ఉపాధ్యాయ లు కోరుకున్న జిల్లాలో  విధులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు చేపడతామన్న ప్రకటనతో ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు కొంత ఊరట చెందిన  317 జీఓ వల్ల తాము నష్టపోయామంటూ నిరసనకు దిగుతున్న కొందరు ఉపాధ్యాయులు లేకపోలేదు . జీఓ అనేది అందరికీ ఉపయోగపడేలా ఉండాలి కానీ కొంతమందికి నష్టం కలిగిస్తుంది అన్న భావన ఉపాధ్యాయులలో ఉంది.కానీ ఈ జీఓ ప్రకారమే అందరూ ఉద్యోగస్థులు విధుల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు.317 జీఓ తీసిన తొలినాళ్ళ లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత కాలంలో  విషయం అలాగే ఉండిపోయింది.ఇప్పుడు ఈ జీఓ వలన స్పౌజ్‌ ‌కేటగిరీలోని కొందరు తాము ఉద్యోగాన్ని కోల్పోయిన అంత బాధగా తీవ్రమైన ఇబ్బందులను పడుతున్నామని  గుసగుసలాడుకుంటున్నారు.

అనుకున్న జిల్లాలోనే బదిలీలు సాధ్యమేనా..
ఉపాధ్యాయ సంఘాలు కొన్ని 317 జీఓ కు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమయ్యాయి.  ఈ విషయమై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బదిలీ ప్రమోషన్లకు సహకరిస్తారా లేక ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏమైనా ఆటంకాలు ఏర్పరిచే విధంగా కార్యచరణ ఉంటుందా అనే అనుమానాలు ఉద్యోగులలో లేకపోలేదు .317 జీఓ అనేది ముఖ్యంగా జిల్లాలో  రాబోవు కాలంలో ఏర్పడే ఉద్యోగ ఖాలీ లలో   ఆయా జిల్లాల్లోని స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చేటట్టు ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో ఒక జిల్లాకు అందరూ రావాలంటే సాధ్యమయ్యే పనేనా తప్పనిసరిగా ఎవరో ఒకరు పక్క జిల్లాకు ప్రాతిపదికన వెళ్లవలసిందే అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు ఎక్కువైతున్నాయో అని చర్చించుకునే వారు లేకపోలేదు. ఉద్యోగం వస్తే చాలని ఎక్కడికైనా పోయి పని చేస్తామన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్న చోటే కావాలని అనుకుంటే ఎలా అని అనుకునే వారు లేకపోలేదు ఏదేమైనా 317 జీఓ జరగబోయే ఉపాధ్యాయుల బదిలీలు  ప్రమోషన్లకు ఆటంకం కలగకుండా ఉండాలని బదిలీల ప్రమోషన్స్ ‌కొరకు ఎదురు చూస్తున్న ఉద్యోగులు భావిస్తున్నారు….
 – దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌,
‌వరంగల్‌ ‌జిల్లా, 9492097974

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *