Day February 5, 2026

కొత్త యెజెండా

దేశం వొకటే. కాని వుత్తరాది, దక్షిణాది రెండు. కాకపోతే వుత్తరాది పాదాల కింద దక్షిణాది వుండాలి, మ్యాప్‌లో వున్నట్టు! జెండా వొకటే. ఎగరేసే జెండా. ఎగరాల్సిన జెండా. ముచ్చటైన మూడు రంగులు. కలిపితే మాత్రం కాషాయం రంగు రావాలి! పార్టీ వొకటే. నువ్వు యెవరికి వోటు వేసినా అధికారంలోవున్న పార్టీయే కమలంలా విరబూయాలి, పూయకపోతే ఎలక్షన్…

మహిళా న్యాయవాది హత్యపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితి అని ఆవేదన వ్యక్తం…

అభివృద్ధి చేసే సత్తా మనకే ఉంది

– కాంగ్రెస్ గెలుపే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలి – ఏప్రిల్ నుంచి మరో విడత ఇండ్ల మంజూరు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కొత్తగూడెం కార్పొరేషన్‌ను సమగ్రాభివృద్ధి చేసే సత్తా మన ప్రభుత్వానికి ఉందని, అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఎలా అభివృద్ధి…

గ్రామ పంచాయతీలకు శుభవార్త

– 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఉత్తర్వులు – తొలి విడతగా రూ.259.36 కోట్లు కేంద్రం విడుదల – మిగిలిన వాటిని వెంటనే విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

గ్రూప్‌-1 ఉద్యోగులకు ఊరట

– సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును రద్దు చేసిన ధర్మాసనం హైదరాబాద్‌,‌ ఫిబ్రవరి 5 (ఆర్‌ఎన్‌ఎ): ‌గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్‌ 1 ‌నియామకాల వ్యవహారంలో సింగిల్‌ ‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో.. గ్రూప్‌ 1 ‌నియామకాలపై విచారణ…

బాధితులే ఉద్యమాలు నిర్మిస్తారు

ఉద్యమాలు అధికారానికి అణచివేతకు వ్యతిరేకంగా వస్తాయి. ఉన్న స్థితి ఊపిరాడనీయనదిగా, అవమానకరంగా ఉన్నప్పుడు దానిని స్వేచ్ఛా వాయువులతో నింపటానికి, ఆత్మగౌరవంతో జీవించటానికి  బాధితులే సంఘటితమై ఉద్యమాలను నిర్మిస్తారు. ఉద్యమాలు భాషాసాహిత్య ఆధిపత్యాలకు వ్యతిరేకంగా కూడా వస్తాయని దక్షిణాదిరాష్ట్రాల వందేళ్ల పైబడ్డ చరిత్ర చెబుతుంది. భాష ఒక సమూహానికి సంబంధించిన అస్తిత్వం. అలాంటి అస్తిత్వం మీద మరొకభాష ఆధిపత్యం భిన్నత్వాల సమాఖ్య సంస్కృతికి…

శాస్త్రీయంగా తిప్పికొడుతుంది

ద్రావిడ సాహిత్యోద్యమ చరిత్ర విస్తృతమైనది. కేవలం ద్రవిడ భాషల ఉమ్మడితనం గురించే కాదు, నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ అస్తిత్వం గురించి, మరీ ముఖ్యంగా ఈ నాలుగు ప్రధాన భాషలతో పాటు ద్రావిడ మైనర్ భాషలు- తుళు, కొడగు, తొడ, కోట, బడగ, ఇరుళ, కురుంబ; అలాగే మధ్య ద్రావిడ మైనర్ భాషలు–గోండి, కొలామి, పార్జి, పెంగో, ఓల్లారి, కొండ / కువి, కొందేకోర్ గడబ భాషల రక్షణ గురించి ఈ ఉద్యమం మాట్లాడుతుంది, మాట్లాడాలి.…

దాక్షిణాత్య ఉద్యమం అనివార్యం

మధ్య , దక్షిణ ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషలు స్థూలంగా మాట్లాడే నైసర్గికప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ కూర్పును పూర్తిగా మాయం చేస్తూ ‘కేంద్రస్వామ్యం’ ఏర్పాటు యత్నాలతో ద్రావిడ రాష్ట్రాల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం అవుతోంది. దక్షిణాది కుత్తుకపై వేలాడుతున్న నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ మరో ప్రమాదం. దేశ సమైక్యత పేరిట…

పునరుజ్జీవన దశ

ద్రావిడ సాహిత్యోద్యమం ప్రస్తుతం పునరుజ్జీవన దశలో ఉందనుకొంటున్నాను. ఇది సాంప్రదాయక ద్రావిడసాహిత్యం, తత్వం, సంస్కృతిపట్ల, యువతలో కొత్త ఆసక్తిని కలిగిస్తోంది. ద్రావిడతత్వం, సంఘ సంస్కరణలు, భాషా ఉద్యమాల చరిత్ర గురించి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. నూతన ద్రావిడ సాహిత్య చైతన్యం స్పష్టంగా మొలకెత్తుతోంది. అయినప్పటికీ, ఇది స్థిరమైన, సృజనాత్మకమైన మరియు ప్రభావవంతమైన సాహిత్యోద్యమంగా రూపుదిద్దుకునే ప్రక్రియ ఇంకా జరగవలసి ఉంది. యువ రచయితలు, బౌద్ధికులు ఈ చైతన్యాన్ని…