త్రివర్ణ పతాక రెపరెపలు
నాగరికత అతి పురాతనం
బహు భాషల గళహారం
అనేక కులాల ఐకమత్యం
పలు మతాల పరిమళం
భిన్న జాతుల వైవిధ్యం
బహుళ జాతి జన జీవనం
భిన్నత్వ లక్షణాల భారతం !
పుణ్య నదుల సమాహారం
సకల సంస్కృతుల సమ్మిళితం
సమిష్టి కుటుంబ సౌభాగ్యం
భరతుడి పాలన ఆదర్శం
ఆర్యుల వేద హిందూస్థానం
దేదీప్య హిందూ ద్వీపకల్పం
స్వర్ణ భారతి సౌందర్యం !
హిమగిరులే కట్టని గోడలు
బంగాళాఖాత భారీ భద్రతలు
హిందు సముద్ర జల రక్షణలు
అరేబియా సంద్ర సరిహద్దులు
గంగా సింధూ మైదాన సిరులు
వింధ్య పర్వత ఔషధ అడవులు
దక్కన్ పీఠభూమి ధగధగలు !
సజీవ నదులే దేశ జలనాళాలు
సమూహ సామాజిక నిర్మితులు
విశ్వ తేజ ప్రజాస్వామ్య జ్యోతులు
ప్రపంచానికే మేధో వితరణలు
లోకానికే సన్మార్గ దర్శక నేలలు
సమస్త మానవాళికే దీపస్తంభాలు
అమృతోత్సవ త్రివర్ణ పతాక రెపరెపలు !
(22 జూలై ‘‘జాతీయ పతాక ఆమోద దినోత్సవం’’ శుభ సందర్భంగా)
– మధుపాళీ
కరీంనగరం, 9949700037




