- రియల్ వ్యాపారులకు మేలు చేసేందుకే జివో రద్దు
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్
- హైపవర్ కమిటీ నివేదిక బయటపెట్టాలన్న శ్రవణ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 21 : చారిత్రక జంట జలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మోసగాడి మరో మోసం 111 జీవో రద్దు అంటూ ట్విటర్ వేదికగా రేవంత్ పేర్కొన్నారు. ఈ జీవోపై 2007లో హైకోర్టు స్టే విధించిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా 69 జీవో చెల్లదని ఆయన స్పష్టం చేశారు.కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారికి అండగా నిలిచే క్రమంలో జివో రద్దు కుట్రకు తెరలేపారని అన్నారు.
దీనిపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. లేకుంటా హైదరాబాద్ జలాశయాలు మురికికూపాలు కాగలవని అన్నారు. ఇదిలావుంటే కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల వి•దే చర్చ వొచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్‌లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది తిట్ల పురాణం రాజకీయం ఏంటని ఆయన ప్రశ్నించారు.
111 జీవోపై 2016 లో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ రిపోర్ట్ 31 మార్చి 2022 రిపోర్ట్ ఇచ్చినట్టు జీవో తెలిపారన్నారు. 111జీవోపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జీవో 111పై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. 111జీవోపై 2016లో హైపర్ కమిటీ ఏర్పాటు చేయగా.. 2022 మార్చి 31న కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది. అయితే ఆ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను బహిర్గతం చేయాలని అన్నారు. జీవో రద్దుతో నగరంలోని జంట జలాశయాలు కూడా మరో హుస్సేన్ సాగర్ లా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో నాయకులు ప్రజా సమస్యలపై చర్చించకుండా.. తిట్ల రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా పేరుతో చైనా కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతోందని దాసోజు ఆరోపించారు.