జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం కానీ కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం చాలా బాధాకరమని పిఆర్టీయూ జగదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కుకునూరి శేఖర్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 11 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు రిలీవర్ వస్తేనే నూతన పాఠశాలలో చేరాలని నిబంధన తొలగించి బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలనిఅన్నారు.అలాగే సెకండరీ గ్రేడ్ , పండిత్, పీఈటీ ఉపాధ్యాయులకు పదోన్నతులతో కూడిన బదిలీలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
11శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి
