ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నగర ట్రాఫిక్ పోలీస్
నెక్లెస్ రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్ రేసింగ్ లీగ్.. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వరకు కొనసాగనుంది. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. ఉంటాయి. నెక్లెస్ రోడ్డులో వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు.
వీవీ విగ్రహం వద్ద షాదన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు. బుద్ధభవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెలకెస్ రోటరీ వైపు నల్లగుట్ట దుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లిజంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవర్ పైనుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు.
తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్‌మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ బడా గణెళిష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణెళిష్ వద్ద రాజ్‌దూత్ లైన్‌లోకి మళ్లిస్తారు.




