ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను ‘తల్లిని చంపి బిడ్డను బతికించడం’గా కూడా ఆయన అదివరకు వ్యాఖ్యానించారు.పలు సందర్భాలలో,సభల్లో తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్నిమోడీ, అమిత్ షా కించపరుస్తూ వస్తున్నారు.తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు.రేవంత్ ప్రకటన తెలంగాణ ప్రజల మనసులోని మాటగా భావించాలి.
ఎస్ కే.జకీర్.
హిందుత్వమా? తెలంగాణ వాదమా ? అన్నది తెలంగాణ ప్రజలు తేల్చుకోక తప్పదు.ఇందుకు ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నది.తెలంగాణలో బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించగలదని సంఘ్ పరివారం వాదన. హైదరాబాద్‌లో ఆరెస్సెస్ సమావేశాలు తరచూ జరుగుతున్నవి. బీజేపీ విజయానికి సంఘ్ పరివార్ సంస్థలన్నింటి నుంచి తోడ్పాటు అంది ంచాలని నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.అయితే తెలంగాణ ప్రజల మనసును కొల్లగొట్టడం బీజేపీ వంటి మతోన్మాద పార్టీకి అంత సులభం కాదు.60 ఏళ్ల డిమాండు నెరవేరడానికి 13 ఏళ్లకు పైగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు పోరాడాయి.ఆ వర్గాలకు ఒక డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తిగా కేసీఆర్ కు గుర్తింపు లభించింది. ఆయన రాజకీయ నాయకత్వ శైలి, బలమూ, బలహీనతల గురించి ప్రస్తుతం చర్చ అనవసరం. గడచినా ఎని మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ సాఫల్య,వైఫల్యాల గురించిన చర్చ కూడా అప్రస్తుతం.కానీ తెలం గాణ వాదమే పునాదిగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో హిందుత్వ వాదమే ఎజండాగా పని చేస్తున్న బీజేపీకి ఆమోదం లభించడం సాధ్యం కాదు.
తెలంగాణలో 2014 తో పోల్చితే టీఆర్ ఎస్‌కు 2018 లో ఓట్ల శాతం పెరిగింది.2014 లో 34 శాతం రాగా,2018 ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు లభించాయి.2018 ఎన్నికల్లో 28.4 శాతం ఓట్లు పోలయ్యాయి.బీజేపీకి ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి.ఏడు నుంచి 40 శాతానికి పైగా ఓట్లు సాధించగలిగే పరిస్థితిలో బీజేపీ ఉందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టి చాలాకాలమైంది.సీనియర్ నాయకుడు లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీ తమకు రెండు రకాలుగా ప్రయో జనం కలుగుతుందని భావిస్తోంది. తెలంగా ణలోని బీసీకి తాము మరో రాష్ట్రం ద్వారా రాజ్యసభకు పంపినట్టు చెప్పుకునేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కింది. యూపీ నుంచి తెలంగాణ వ్యక్తిని రాజ్యసభకు పంపడం ద్వారా తాము తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ చేస్తున్నామో చెప్పకనే చెప్పింది.
కాగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. ఈ కమిటీలో స్వామి గౌడ్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, డీ.రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుతోపాటు మరో ఇద్దరు సభ్యు లుగా ఉన్నారు.పార్టీలో చేరాలని నిర్ణయించుకునే వారు ముందుగా సమన్వయ కమిటీకి తెలియజేయాలి. పార్టీలో చేరే వారితో చర్చలు, వారి బలాబలాలు అంచనా వేయడం, పార్టీ నాయకత్వానికి ఈ కమిటీ తెలియజేస్తుంది. ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ వేశారు. రాష్ట్రంలోని ఎస్.సీ,ఎస్.టీ. నియో జవర్గాలపై హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.ఎస్.టీ. నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్ రావు పని చేస్తున్నారు.చాడా సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలం గౌడ్ సభ్యులుగా ఉన్నారు.ఎస్సీ నియో జకవర్గాలపై ఫోకస్ లో భాగంగా ‘మిషన్-19 ‘ను చేబట్టారు.పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థా యిలో బలమైన నాయకుల కోసం బీజేపీ నాయకత్వం అన్వేషణ సాగుతోంది.వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలాబలాలను అంచనా వేసి బలమైన వ్యక్తులను ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.పార్టీ క్యాడర్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని బండి సంజయ్ ఆదేశించారు. ఎన్నికలకు 18 నెలలకు పైగా వ్యవధి ఉన్నా ఇప్పటినుంచే పోలింగు బూత్ స్థాయిలో బలపడాలని బీజేపీ భావిస్తోంది.
పార్టీ ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించే అవకాశాలున్నవి.ప్రచారం కోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్ మ్యాప్‌ను, ఫార్మూలాను బీజేపీ నాయకులు ఖరారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని బిజేపి నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ,ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది.
60 ఏళ్ల డిమాండు నెరవేరడానికి 13 ఏళ్లకు పైగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు పోరాడాయి.ఆ వర్గాలకు ఒక డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తిగా కేసీఆర్ కు గుర్తింపు లభించింది.ఆయన రాజకీయ నాయకత్వ శైలి,బలమూ,బలహీనతల గురించి ప్రస్తుతం చర్చ అనవసరం.గడచినా ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ సాఫల్య,వైఫల్యాల గురించిన చర్చ కూడా అప్రస్తుతం.కానీ తెలంగాణ వాదమే పునాదిగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో హిందుత్వ వాదమే ఎజండాగా పని చేస్తున్న బీజేపీకి ఆమోదం లభించడం సాధ్యం కాదు.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేయాలన్న ఆలోచన. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, డీకే. అరుణ, రఘునందన్ రావు తదితర ముఖ్యులు పది మంది వరకు బలంగా కని పిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్.అయితే ప్రధానమంత్రి మోడీ ఇమేజ్, టిఆర్‌ఎస్ పై ప్రజల్లో బలపడుతున్న వ్యతిరేకత తమకు అదనపు బలంగా బీజేపీ శ్రేణులు చెబుతున్నవి.. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో మాత్రమే తమకు ‘అనుకూల’ వాతావరణం ఉన్నట్టు పార్టీ అగ్ర నాయకత్వం అంచనా వేస్తున్నది.అందువల్లనే ఈ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నది. సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యా మ్నాయ జాతీయ పార్టీని నిర్మించాల నుకుంటున్నారు. అయితే ఆ జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్ కొన్నేళ్లుగా తీవ్ర స్థాయిలో విరుచు కుపడుతున్నారు. ఇక జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజు రాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి బూస్ట్ ఇచ్చాయి. బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ’ పాద యాత్రలు, వాటిని ఆధారం చేసుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తది తరుల రాకపోకలు పార్టీలో ఉత్సాహం నింపాయి.తెలంగాణలో పార్టీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
‘’కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది. యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది. పార్లమెంటులో మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారు. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విద్వేషాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనపై ఎటువంటి చర్చా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇది ప్రజా స్వామ్యమా? అందరితో మాట్లాడి కలిసి కట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు.కానీ అధికారంతో వచ్చిన అహంకారం తలకెక్కి క్రూరంగా వ్యవహరించారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విద్వేషాలు రెండు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు ఎటువంటి రాజకీయ ప్రయోజనం లభించలేదు.వాజ్ పేయి హయాంలో బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అన్ని నిర్ణయాలూ శాంతియుతంగానే జరిగాయి’’ అని ప్రధాని మోడీ పార్లమెంటులో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను ‘తల్లిని చంపి బిడ్డను బతికించడం’గా కూడా ఆయన అదివరకు వ్యాఖ్యానించారు.పలు సందర్భాలలో,సభల్లో తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్నిమోడీ,అమిత్ షా కించప రుస్తూ వస్తున్నారు.తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురు వారం డిమాండ్ చేశారు.రేవంత్ ప్రకటన తెలంగాణ ప్రజల మనసులోని మాటగా భావించాలి. ఇదిలా ఉండగా తెలంగాణలో బీజేపీ త్రిపుర వ్యూహం అనుసరించనున్నట్టు తెలుస్తోంది. విజయమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేలా సంఘ్ పరివార్ నాయకులు ఆ రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చినట్టు విశ్లేషణలున్నవి.ఈ ఫార్ములాతోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్షాల్ని ఓడించి భాజపా అధికారంలోకి వచ్చిందని సంఘ్ పరివారం చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలలోనూ బీజేపీ పాగా వేయడం ఎవరూ ఊహించని సన్నివేశం.
‘’ఫరూఖ్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్,రామకృష్ణ హెగ్డే, ఎస్‌ఆర్ బొమ్మై, ఎంజీఆర్, కరుణానిధి తదితర ముఖ్యమంత్రులను,కమ్యూనిస్టు ప్రభుత్వాలను కాంగ్రెస్ దౌర్జన్యంగా గద్దె దించింది. ఏపీలోనూ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టింది. అప్పుడు ఎన్టీఆర్ అస్వస్థతతో ఉన్నారు. కనీసం వందసార్లు రాష్ట్రపతి పాలన విధించి, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్ప కూల్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కింది. కాంగ్రెస్ అధికార దాహంతో దేశంలో ప్రజా స్వామ్యం గొంతు నులిమింది.కాంగ్రెస్ ఆలోచనలను, సిద్ధాంతాన్ని అర్బన్ నక్సలైట్లు ప్రభావితం చేస్తు న్నారు.కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్ల మనస్తత్వంతో ఆలోచిస్తున్నందునే చరిత్రను మేము తిరగ రాస్తున్నాం.మేము చరిత్రను మార్చడం లేదు. ప్రజల జ్ఞాపకాలను తాజా చేస్తున్నాం. చరిత్రను కేవలం కొన్నివందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాం. చరిత్ర అంటే అదే’’ ప్రధాని మోడీ పార్లమెంటులో అన్నారు.
మరి మహారాష్ట్ర పరిణామాలు ఏమిటి? ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోవడం, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడడం కాకతా ళీయంగా జరిగిందా? గాలివానకు పడిపో యిందా? ఎలాంటి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఒక ప్రభుత్వాన్ని కూల్చి వేయడం సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తప్పిదాలు చేసి ఉండవచ్చు.అందుకు మూల్యం కూడా ఆ పార్టీ చెల్లిస్తోంది.అయితే 9 సంవత్స రాలలోనే 9 రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన క్రెడిట్ బీజేపీకే దక్కింది.మోడీ మాటలకూ, ఆచరణకూ పొంతన ఉన్నదా?
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినందువల్ల బీజేపీకి అదనంగా ఆ పార్టీకి తెలంగాణాలో రాజకీయ ప్రయోజనం లభించే అవకాశాలేమీ లేవు.కొంత ఉత్తేజం తప్ప!!




