ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి
హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా..ఒక మహిళ పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతులు శాయంపేట మండల కేంద్రానికి చెందిన మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




