న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కృతజ్ఞతతు ప్రకటించారు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనుండడంతో.. దేశ చరిత్రలో ఈ రోజును చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణిస్తూ.. ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో కూడిన సైకత శిల్పాన్ని రూపొందించాడు. ద్రౌపది ముర్ము ఎన్నికైన రోజున కూడా ఈ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుక ఆర్ట్ ను వేశాడు.




