- ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ
- కాన్వాయ్ లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 03 : తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా ఆయన స్వయంగా వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేకుండా తన కార్యాలయంలోని ఓఎస్‌డి ద్వారా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు పంపిచారు.
అయితే సాధారణంగా ఉండే సంప్రదాయం ప్రకారమే నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరుకు సిఎం బాధ్యతలు నిర్వహించవలసిందిగా గవర్నర్ సిఎం కెసిఆర్‌ను కోరారు. అయితే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించిన అనంతరం ఎటువంటి కాన్వాయ్ లేకుండా తన వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే రెండు కార్లలో ప్రగతి భవన్ నుండి నేరుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు.





