బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 19: కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా హైదరాబాద్ మహా నగరాన్ని గొప్ప విజన్ తో ముందుకు తీసుకువెళ్తున్నట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్ నగర్ డివిజన్ విఎం హోమ్ గ్రౌండ్ లో వాకర్స్ త మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్, బిఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
నియోజకవర్గం పరిదిలో గల చెరువుల వద్ద ఓపెన్ జిమ్ లు, చిన్నారులు అడుకోవటానికి క్రీడా పరికరాలు, పచ్చని బయళ్లతో కూడిన పార్కులను అభివృద్ధి చేశామన్నారు. అదేవిధంగా నియోజక వర్గములో రూ.40 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేసామని తెలిపారు. కాలుష్య రహిత గ్రీన్ మహేశ్వరం కోసం బాటలు వేసామన్నారు. తెల్లవారుజామునే గ్రౌండ్ కు చేరుకున్న చేరుకున్న సబితా ఇంద్రారెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం కోసం మార్నింగ్ వాక్, జాగింగ్, కసరత్తులు చేస్తున్న సీనియర్ సీటీజన్లు, యువత, మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారంతా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సబితమ్మకు మద్దతు పలికి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని మద్దతు ప్రకటించారు. మద్దతు తెలిపిన వారికి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాటలు వేసుకుందమన్నారు. ఈ కార్యక్రమంలో బిఅర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయో భిలాషులు, తదితరులు పాల్గొన్నారు.





