శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి ఘనంగా నివాళి

న్యూ దిల్లీ, జూలై 6 : భారతీయ జనసంఘ్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని పార్లమేంటరీ సెంట్రల్‌ ‌హాల్‌లో శ్యామా  ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యామప్రసాద్‌ ‌చిత్రపటానికి పూలమాలలు వేసి  ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా, కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. పూలమాలలు వేసి శ్యామప్రసాద్‌ ‌కు నివాళులర్పించారు.

హైదరాబాద్‌ ‌బీజేపీ ఆఫీస్‌లోనూ వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ముఖర్జీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు మొక్కలు నాటారు. దేశ ప్రజల కోసం నమ్మిన సిద్దాంతం కోసం శ్యామ ప్రసాద్‌ ‌ముఖర్జీ కష్టపడ్డారని బండి సంజయ్‌ అన్నారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు ఉండొద్దని గట్టిగా పోరాడారని గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *