జనసంద్రంగా మారిన మేడారం
గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు
తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు
శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర
సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు,
భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ
నేడు అమ్మవార్ల వన ప్రవేశం..జాతర ముగింపు
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : మేడారం మహాజాతర జనసంద్రమైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఈ ఏడాది వైభవంగా జరుగుతుంది. జాతరలో మూడో రోజు శుక్రవారం మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. దాదాపు 2 వేల వరకు జనాభా ఉండే చిన్న గ్రామం ఇప్పుడు మహానగరంగా మారిపోయింది. గురువారం రాత్రి గద్దెపైకి సమ్మక్క తల్లిని పూజారులు ప్రతిష్టించగా అశేష సంఖ్యలో భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. గద్దల ప్రాంగణం వద్ద అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క తోపాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరి ఉండడంతో దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తిపోయింది. మేడారానికి వొచ్చే అన్ని దారులు వాహనాల రాకపోకలతో బిజిగా అయిపోయాయి. మరోవైపు ఆనవాయితీ ప్రకారం ముందుగా జంపన్న వాగుకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తూ, తలనీలాలు సమర్పిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పూనకాలతో జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
జారతలో ప్రముఖులు పూజలు
మేడారం జాతరను శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దంపతులు, కేంద్ర గిరిజన శాఖమంత్రి అర్జున్ ముండా తదితరులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, టూరిజం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మురళి నాయక్, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు.