- ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా
- పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు
- రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని ఖాలీలు భర్తీ అయ్యాయో కూడా తెలపాలన్నారు. ఉద్యోగాల భర్తీపై రెండు రోజుల్లో సవిూక్ష నిర్వహిస్తామనీ, దీనికి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆయన టీఎస్ పిఎస్ సి చైర్మన్ ను ఆదేశించారు. రైతు భరోసా పథకంపై కూడా సీఎం సవిూక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో.. ఏక్సైజ్ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై చర్చించారు. ఈ సవిూక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సీవిూక్షించారు. అయితే, ప్రభుత్వ ఖజానాలో మాత్రం నిధులు లేనట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో యాసంగికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఎలాగైన నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం




