వరుసగా పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు

  • ఏడు రోజుల్లో ఆరు సార్లు పెంచిన చమురు కంపెనీలు
  • లీటరు పెట్రోలుపై 30 పైసలు..డీజిల్‌పై 35 పైసలు పెంపు

న్యూ దిల్లీ, మార్చి 28 : దేశంలో పెట్రోలు ధరలుపెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల్లో ఆరోసారి ధరలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ ‌పెట్రోల్‌పై సగటను 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలు. దీంతో ధరల పెంపును చేపట్టిన వారంరోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై 4 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల 10 పైసలు పెరిగాయి. పెరిగి ధరతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ 112 ‌రూపాయల 71 పైసలకు చేరుకోగా, డీజిల్‌ 99 ‌రూపాయల 7 పైసలకు చేరుకుంది. విశాఖలో పెట్రోల్‌ 113 ‌రూపాయల 34 పైసలు, డీజిల్‌ 99 ‌రూపాయల 33 పైసలకు పెరిగింది.

దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ 99 ‌రూపాయల 41 పైసలు, డీజిల్‌కు 90 రూపాయల 77 పైసలుగా ఉంది. ముంబయిలో పెట్రోల్‌ 114 ‌రూపాయల 19 పైసలు.. డీజిల్‌ 98 ‌రూపాయల 50 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ 105 ‌రూపాయల 18 పైసలు… డీజిల్‌ 95 ‌రూపాయల 33 పైసలకు చేరింది. కోల్‌ ‌కతాలో పెట్రోల్‌ 108 ‌రూపాయల 85 పైసలు, డీజిల్‌కు 93 రూపాయల 92 పైసలకు ఎగబాకింది.  రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలపై వాహనదారులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *