లోపభూయిష్టంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌

  • ‌బీజేపీ ఐడియాలజీని ప్రతిబింబిస్తుంది
  • బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం
  • డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌కుట్ర
  • కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖయం
  • కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌పై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ ‌లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో వి•డియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. మైనారిటీ డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ కుట్రచేస్తుందని ఆరోపించారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌, ‌బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేవి• కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్‌ ‌పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ ‌పార్టీ చూస్తుందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. ముస్లింలు, కైస్త్రవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలని మంత్రి కేటీఆర్‌ ‌చెప్పారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ కుమ్మక్కయ్యి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ ‌పార్టీ వీక్‌ ‌క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు.
పదేళ్లలో కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ ముస్లింలు, బడుగు వర్గాల మధ్య చిచ్చు పెడుతోందని మంత్రి కేటీఆర్‌  ‌మండిపడ్డారు.  మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్‌ ‌చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌, ‌బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ ‌గతంలోనూ చాలాసార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’2004 – 14 మధ్య కాంగ్రెస్‌ ‌మైనారిటీల కోసం ఏం చేసింది. పదేళ్లలో కాంగ్రెస్‌ ‌మైనారిటీల కోసం రూ.930 కోట్లు ఖర్చు చేస్తే, గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ‌రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ స్ఫూర్తితో కాంగ్రెస్‌ ఈ ‌మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చినట్లుంది.’ అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌తప్పుడు వాగ్ధానాలు చేయడంలో దిట్ట అని కేటీఆర్‌ ‌మండిపడ్డారు.
గతంలోనూ ఇలాంటి హావి•లనే ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ’ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ ‌చెబుతోంది. అలా చేస్తే మైనారిటీల ప్రత్యేక హోదా పోతుంది. మైనారిటీ డిక్లరేషన్‌ ‌పేరుతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ముస్లింలు, కైస్త్రవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలు. వీరి విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఆటలాడుతున్నాయి.’ అని కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేరుస్తామని కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌ ‌చెబుతోందని, ఇది ఓ కుట్ర అని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ఈ డిక్లరేషన్‌ ‌ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్‌ ‌లో కేసీఆర్‌ ‌పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌, ‌కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి ఇద్దరూ ఓటమి పాలవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *