- అవసరమైన చోట తక్షణ చర్యలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
- వరదలపై ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమిక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాస్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో ప్రగతి భవన్‌లో సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.




