రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలి

రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీశ్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ ‌పట్టణ పర్యటన లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకు ముందు రంజోల్‌ ‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండస్‌ ‌స్కూల్‌ ‌నూ ఆయన ప్రారంభించారు. పద్మశాలి, అరెకటికే సంఘాలకు  కమ్యూనిటీ భవనాలకు స్థలం,  భవన నిర్మాణాలకు నిధులు కేటాయించి పనులకు శంకు స్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల పనులు తర్వతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు నాణ్యతలో, లోపాలు లేకుండా  నిర్మాణలు పూర్తి చేసి, రెండు మాసాలలో లబ్దిదారులకు అందించాలని మంత్రి హరీశ్‌ ‌రావు అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు బి బి పాటిల్‌,   ‌తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ  చైర్మన్‌ ‌చింత ప్రభాకర్‌ , ‌జిల్లా కలెక్టర్‌  ‌డా  శరత్‌, ఎమ్మెల్యే మాణిక్యరావు, డిసిఎమ్‌ఎస్‌ ‌ఛైర్మన్‌ ‌శివ కుమార్‌. ‌సంబంధిత శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *