రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమ్మితే పైసలు ఇచ్చేదెట్లా
గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు
అందుకే ఆలోచించి వోటేయాలి
ఆగమాగం అయితే వెనక్కి పోతాం
పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ
కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు
పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌విమర్శలు

పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌రాహుల్‌ ‌గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో వేస్తం అంటున్నడని, ఆయనకు ఎవుసం తెల్వదని, అందుకే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని మాట్లడతడని, దీనిపై రైతులు సీరియస్‌గా ఆలోచన చేయాలన్నాని సిఎం కెసిఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ‌వాళ్లు కుళ్లాగా చెప్తున్నరని, ధరణిని తీసేసేందుకు గొడ్డలి భుజాన పెట్టుకుని రెడీగా ఉన్నరని, మరి ధరిణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది..వడ్లమ్మిన పైసలు ఎట్లొస్తయ్‌….‌రైతు చనిపోతే రైతు బీమా ఎట్లొస్తది…అంటూ కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. మళ్లీ ఎమ్మార్వో ఆఫీసు, పహానీ నకల్‌లు, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ‌సంతకం అనుకుంట తిరగాల్సి వొస్తదని కెసిఆర్‌ ‌హెచ్చరించారు. ఆఫీసులల్లకు పోతే…ఎన్నెకరాలు ఉందంటరు..ఎంతొస్తదంటరు…రూ.80 వేలు వొస్తయంటే నాకు ఓ రూ.30 వేలు ఇయ్యి సంతకం పెడుతం అంటరని విమర్శించారు. అంతేనా..కాదా..అంటూ ప్రజలను అడిగారు. అంటే మళ్ల దలారీ రాజ్యం వొస్తదని, ఇయ్యన్నీ ఆలోచించి వోటేయాల్నని సీఎం కేసీఆర్‌ ‌కోరారు. మంగళవారం పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని, రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు..లొల్లి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం మంచిగా ఉన్నదని, అందరం కలిసిమెలిసి బతుకుతున్నామని, అదే కాంగ్రెస్‌ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ, మతకల్లోలాలు, ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టారో ఆలోచించాలన్నారు. వోటు అనేది ముఖ్యమని, పాలిటిక్స్ ‌కూడా చాలా ముఖ్యమని, రాయి ఏందో..రత్నం ఏందో గుర్తు పట్టాలని సూచించారు. పార్టీల వైఖరి కూడా చాలా ముఖ్యమని కేసీఆర్‌ అన్నారు. ఎవరికిపడితే వాళ్లకు వోటేయొదద్దని, ఆగం కావొద్దని, ధరణిని తీసేస్తే మళ్లీ పాత రోజులే వొస్తయని, దలారీ రాజ్యం అయితదని, రిజిస్ట్రేషన్‌ల కోసం నానా తిప్పలు అయితయని, వెనుకటి లెక్కనే వి• భూమి వి•ద ప్రభుత్వంలో ఉన్న అధికారులకు పెత్తనం వొస్తదని, వాళ్లు తల్చుకుంటే ఎవరి భూమిని ఎవరి పేరు వి•దకైనా మార్చే పరిస్థితులు మళ్లీ వొస్తయన్నారు. కానీ ధరిణి ఉంటే.. ముఖ్యమంత్రి కూడా భూమిని ఇంకొకరి పేరు వి•దకు మార్చలేడని, మరి కాంగ్రెస్‌ ‌పార్టీ ధరణి తీసేయాలనుడు కరెక్టేనా..అని ప్రజలు గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు.

కాంగ్రెస్‌కు వోటేస్తే ఏమైతదనేది వి• ఊర్లళ్ల తెల్వనోళ్లకు ప్రజలే అర్థమైతట్లు చెప్పాలని, ప్రజల మేలు కోరే పార్టీకే వోటేయాలని, అప్పుడు ప్రజల బతుకులు బాగుంటయని, రాష్ట్రం ఇంకింత బాగుపడుతదని కేసీఆర్‌ అన్నారు. పేదల సంక్షేమం ఎవరైనా ఆలోచించారా…పేదింటి పిల్ల పెళ్లికి లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమన్న ఆలోచించిందా..అంటూ సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. పేదవాళ్లు ఉంటే వాళ్ల కండ్లు చూపించాలని, కళ్ల అద్దాలు ఇవ్వాలని, కంటి వెలుగు పోగ్రామ్‌ ‌పెట్టాలని ఓ గవర్నమెంటన్నా ఆలోచించిందావాళ్ల మైండుకన్నా తట్టిందా…అంటూ కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. ఆడ పిల్లలు ప్రసూతికి పోతే..డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేస్తే.. కేసీఆర్‌ ‌కిట్టు పెట్టి తాము గవర్నమెంట్‌ ‌దావాఖానాలను బలోపేతం చేశామని, ఏవిధంగా 13 లక్షల కుటుంబాలకు కల్యాణలక్ష్మి వొచ్చిందో ప్రజలకు తెలుసునన్నారు. ఏ విధంగా పేదలను ఆదుకుంటున్నామో వారికి తెలుసునన్నారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలను తీసుకువొచ్చామని, అవి పీతాంబరాలు కాకపోవచ్చునని, కానీ అటు కార్మికులకు బతుకుతెరువు, ఇటు పేదసాదలకు ఓ చీర దొరుకుతుండడంతో రెండు ప్రయోజనాలు నెరవేరుతున్నాయన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, విద్య విషయంలో ఇవాళ రెసిడెన్షియల్‌ ‌కళాశాలలు వొచ్చాయని, పెద్దపల్లిలో కూడా చాలా ఉన్నయని, అందరికీ కాలేజీలు పెట్టుకున్నామని, గిరిజనులకు, మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు పెట్టినామన్నారు. ఈ మధ్య ఓసీలు తాము కూడా ఉన్నమని, తమదాంట్లో పేదలున్నారని, తమకు కాలేజీలు వొద్దా అని అడిగారని, అందుకే మొన్న నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ఓసీల కోసం రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌పెడతామని ప్రకటించామన్నారు.

ఎవరు పేదలైతే వారికి న్యాయం జరగాలన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్య దొరుకుతుందని, మరి ఈ రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలను వాళ్లు ఎందుకు పెట్టలేదో ఆలోచించాలన్నారు. ఈ రోజు బస్తీ దవాఖాలు, పల్లె దవాఖానాలు, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్‌ ‌కిట్‌ ఇవన్నీ సామాజిక బాధ్యతతో, సామాన్య, నిరుపేద ప్రజలకు అవసరమైన స్కీమ్స్ ‌తీసుకువొచ్చామన్నారు. గతంలో ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు సిఎం కెసిఆర్‌. ‌ప్రజలు కూడా ఆలోచన చేయాలని, తాము మేనిఫెస్టోలో చెప్పినయ్‌ ‌తక్కువేనని, పెట్టకుండా చేసినయ్‌ ఎక్కువని, చాంతాడంత లిస్టున్నదన్నారు. పేద పిల్లలకు సీటు వొస్తే రూ.20లక్షల గ్రాంట్‌ ఇచ్చి విదేశాలకు ప్రభుత్వం ఉండెనాఅన్నారు. జ్యోతిబా ఫూలే వి•ద, అంబేద్కర్‌, ఇతరుల పేర్లను పెట్టి సాయం అందిస్తున్నామన్నారు. జీవితంల జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ వొస్తదని మనం అనుకున్నమా అని, అసలు కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి కాకపోతే పెద్దపల్లి జిల్లా అయితుండెనా అని, తెలంగాణ రాకపోతే… మనోహర్‌రెడ్డే ఎమ్మెల్యే లేకపోతే పెద్దపల్లి జిల్లా వొచ్చేదా..అంటూ కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా తెచ్చినందుకైనా లక్ష మెజారిటీతోని మనోహర్‌రెడ్డిని గెలిపించాలని వోటర్లకు కెసిఆర్‌ ‌విజ్ఞప్లిత చేశారు. కరీంనగర్‌-‌మంచిర్యాల మధ్యన ఓ గ్రోత్‌ ‌సెంటర్‌ ‌రావాలని తాను ఆలోచిస్తుంటే.. పెద్దపల్లిలో పెట్టండంటూ తన వొద్ద కూర్చొని పెద్దపల్లిని జిల్లా చేయించిందే మనోహర్‌రెడ్డి అంటూ సీఎం కేసీఆర్‌ అన్నారు.

నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మనోహర్‌ ‌రెడ్డి విద్యావేత్త అని, ఎమ్మెల్యే అయ్యాడని, నిస్వార్థంగా పని చేస్తడని, ఈ పదేండ్లలో ఒక్క రోజు కూడా వ్యక్తిగత పనుల గురించి అడగలేదని కెసిఆర్‌ ‌ప్రశంసించారు. పెద్దపల్లి పనులు..తమ ఆయకట్టుకు నీళ్లు వొస్తలేవని, వి•ద మోటార్లు పెడుతున్నారని తనకు చెప్పేవారని, ఇంకేదన్న చేసి ఓదెల, శ్రీరాంపూర్‌కు నీల్లు పోవాలని అడిగారని మనోహర్‌ ‌రెడ్డి రైతుల గురించి తపన పడ్డాడన్నారు. పదేండ్ల కిందనే రూ. 40 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఊరికి చెట్లు పంపిణీ చేసిండని, నియోజకవర్గం బాగుపడాలని ఆలోచిస్తడని, ఆయనకు డ్రామాలు, నాటకాలు వేసుడు రాదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడని, అరమరికలు లేకుండా నిజాయితీగా ఉంటడని, దొంగ ధర్నాలు, దొంగ దీక్షలు చేసుడు ఆయనకు రాదని, సాదాసీదాగా ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని, ప్రజల కోసం పని చేసే వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపిస్తూ..లక్ష వోట్ల మెజార్టీతో మనోహర్‌ ‌రెడ్డిని గెలిపించాలని కేసీఆర్‌ ‌ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *