Take a fresh look at your lifestyle.

రాష్ట్ర పరువు తీస్తున్న కెసిఆర్‌

‌కెసిఆర్‌ను పట్టించుకోని నితీశ్‌ ‌కుమార్‌
‌బిజెపిని తిట్టడానికే రాష్ట్రాల పర్యటనలు
తెలంగాణలో ఆయనను సాగనంపడం ఖాయం
కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌.. ‌బీహార్‌ ‌పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడు తున్నారు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ ‌పర్యటనలు చేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్‌ ‌గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బీహార్‌ ‌పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ’ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్‌ అం‌టున్నారు. తెలంగాణను ఉద్దరించానని దేశమంతా తిరిగి చెబుతున్నారు. బీహార్‌లో కేసీఆర్‌ ‌మాటలు వినలేక నితీష్‌కుమార్‌ ‌లేచి వెళ్లే పరిస్థితి దేశమంతా టీవీల్లో చూసిందని అన్నారు. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్‌ ‌పట్టించుకోవడం లేదు. అంటే తెలంగాణ రైతులను పట్టించుకోక పోవడమే తెలంగాణ మోడలా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు తీసుకుని ఇతర రాష్టాల్ల్రో పంచుతున్నారని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో 15 శాఖలు ఉన్నాయని.. ఆ కుటుంబం మారితేనే తెలంగాణ బాగుడుతుందని చెప్పారు.

తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ప్రగతిభవన్‌ ‌లోనే ఉన్నాయన్న ఆయన, రాష్టాన్న్రి కేసీఆర్‌ ‌నవ్వుల పాలు చేస్తుండని విమర్శించారు. ఇతర రాష్టాల్ల్రో కూడా కేసీఆర్‌ను ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్లి పోతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరు రక్షించలేరని వ్యాఖ్యానిం చారు. ఇతర రాష్టాల్రతో పాటు మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమేనన్నారు. హావి•ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌ 8 ఏళ్లలో ఎన్ని డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు కట్టారని నిలదీశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్‌ ‌షో లను అనేక రాష్టాల్రు నిషేధిస్తే.. కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌మాత్రం ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించడం సిగ్గుచేట న్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందాం అంటే సీఎం అందుబాటులో ఉండరని విమర్శించారు. మోడీ ది నీతివంతమైన పాలన అని సీఎం కేసీఆర్‌ ‌గజ్వేల్లో పొగిడారని.. అయితే హూజూరాబాద్‌లో గెలవగానే అది అవినీతి పాలన అయ్యిందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ ‌లాంటి వాళ్లకు బీజేపీ భయపడదని..మోడీ పాలనలో దేశంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ సమస్యలు తీర్చే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటు న్నారని.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ ‌పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ ‌తీరును చూసి తెలంగాణను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. బీహార్‌ ‌వెళ్లి ఏదో చెప్పాలనుకున్నారు. కేసీఆర్‌ ‌మాటలు వినలేక బీహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌వెళ్లిపోతుంటే కేసీఆర్‌ ‌బ్రతిమాలుకున్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్‌ ‌చెబుతున్నారు. కేసీఆర్‌ ‌మాటలు విని సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌నువ్వుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉండటమే తెలంగాణ మోడలా. తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్‌, ‌పంజాబ్‌లో పంచుతున్నారు. తెలంగాణను ఉద్దరించానని చెబుతూ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. మునావర్‌ ‌ఫరూకీ షోకు అంత పెద్ద ఎత్తున భద్రత కల్పించి నిర్వహించాల్సిన అవసరం ఏముంది. ఈడీ, సీబీఐలను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ కిషన్‌ ‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Leave a Reply