బాలల భారతం
-డా.పులివర్తి కృష్ణమూర్తి
యుద్ధానికి కూడా సన్నద్దుడైనాడు. ఆ సమయంలో వేద వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుని వచ్చి, యుద్ద ప్రయత్నం మానుకోమన్నాడు. పాండవులతో విరోధం మంచిది కాదన్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకుండా ఉండానన్నాడు. మైత్రేయుడనే మునివచ్చి శ్రేయస్సాధకమైన మార్గం చూపిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో వున్న పాండువులను మైత్రేయుడనే ముని కలిసాడు. ఆ తర్వాత మైత్రేయుడు ధృతరాష్ట్రునికడకు వచ్చాడు . ధృతరాష్ట్రుడు మునికి అతిథి సత్కారాలు జరిపి, మీరు పాండవులను చూసారా? వారెలా ఉన్నారని అడిగాడు. మైత్రేయుడు వారంతా కుశలంగా ఉన్నారని చెప్పి ఆ తర్వాత జరిగినదాన్ని గురించి ఉపేక్షించడం అవివేకం అన్నాడు. సత్యవ్రత పరాయుణులైన పాండవులతో విద్వేషం పనికిరాదన్నాడు.
అలాంటి వారితో స్నేహం చేయడమే మంచిదన్నాడు. హిడిరబ, కిర్మీరాది ఘోర రాక్షసులను హతమార్చిన మహా వీరులతో వైరం పనికిరాదన్నాడు. ప్రమాదకరం అంటూ వారించాడు. ఈ మాటలు విన్న దుర్యోదనుడు కోపంతో తన పాదాలతో భూమి మీద తట్టుతూ, తొడలు చరుస్తూ వికటాట్టహాసం చేశాడు. ఇది చూసి మైత్రేయునికి కోపం వచ్చింది. నువ్వు పెద్దల మాటలు విననంత మూరు?డవని నాకు తెలియదు. ఈ దోషము వలన రాబోయే సంగ్రామంలో నీ తొడలు భీముని చేతులతో తునా తునకలవుతాయి అంటూ శపించాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు విని ఆయన పాదాల మీడి పడిపోయాడు. కరుణించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు మైత్రేయుడు బుద్ది కలిగి మసులుకుంటే ఏ ప్రమాదమూ ఉండదన్నాడు. మైత్రేయుడు వెళ్ళిపోయాడు.
ధృతరాష్ట్రుడు మైత్రేయుడు కిర్మీర వధ గురించి ప్రస్తావించగా ఆ విశేషాలు చెప్పమని అడిగాడు. కానీ మైత్రేయుడు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండమని చెప్పి విదురుడు ఆ వివరాలు చెబుతాడులే అన్నాడు. భీముని పరాక్రమం గురించిన సమాచారాన్ని వినడం ఇష్టంలేని దుర్యోదనుడూ అక్కడ నుండి నిష్క్రమించాడు. విదురుడు ధృతరాష్ట్రునికిలా చెప్పడం ప్రారంభించాడు.
(మిగతా…తరువాయి వారం)





