తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం
పారదర్శకంగా ప్రాజెక్టుల వివరాలు ఉండాలి
జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ సవిూక్ష
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్
కాళేశ్వరం, మేడిగడ్డపై ఉత్తమ్ ప్రత్యేకంగా వివరాలు అడిగారు. త్వరలో మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… మేడిగడ్డ విషయంలో విచారణ జరగాలి. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి.తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఛాంబర్‌కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. పూర్ణ కుంభంతో వేదపండితులు మంత్రి ఉత్తమ్‌కి స్వాగతం పలికారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.





