మూడో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఆం‌దోళనకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల అరెస్ట్

‌న్యూ దిల్లీ, జూన్‌ 15 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌  ‌శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక రెండో రోజు 10 గంటల పాటు రాహుల్‌ ‌ను విచారించింది ఈడీ. సుమారు 80 ప్రశ్నలను ఈడీ సంధించినట్లు తెలుస్తుంది.

కాగా  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తుందని కాంగ్రెస్‌ ‌పార్టీ మండిపడింది. ఈడీని కేంద్రం ఎలక్షన్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌గా వాడుకుంటుందని, ఇప్పటిదాకా ప్రత్యర్థులపై 5 వేల కేసులు పెట్టించిందని ఆరోపించింది. సోనియా, రాహుల్‌లపై ఎన్ని అక్రమ  కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *