మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌
సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం
ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం
మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా..
మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ,
ప్రియాంకా గాంధీల వాక్యలు  

మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ ‌రాబోతోందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మంగళవారం సాయంత్రం మల్కాజ్‌ ‌గిరిలో జరిగిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో తమది రక్త సంబంధమని, కుటుంబ బంధమని చెప్పారు. ఇంది రాగాంధీ నుంచి తమ వరకు ఆత్మ సంబంధమని అన్నారు. కుట్రలు, హింస లేని భారత్‌ ‌కోసం తాను భారత్‌ ‌జోడో యాత్ర చేసినట్టు చెప్పారు. తనపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందని, తనకు ఇచ్చిన క్వార్టర్‌ ‌ను వాపస్‌ ‌తీసుకుందని చెప్పారు. తెలంగాణలో ఇంత అవినీతి జరుగుతున్న కేసీఆర్‌ ‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నిం చారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులెందుకు పెట్టడం లేదన్నారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని రాహుల్‌ ‌పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పోటీ చేస్తుంది కానీ, తెలంగాణలో చేయదని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ‌తిన్న అవినీతి సొమ్మును కక్కించి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌సర్కారులో నిరుద్యోగులకు
కొలువు రాలేదన్నారు. పేదలకు డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలే కథానాయకుల్కె పోలింగ్‌ ‌రోజు ముందు ఉండి కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించాలని కోరారు. చెల్లెలు ప్రియాంకతో కలసి ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌మైనంపల్లిలు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌సునామీ వచ్చింది.. ఈ సునామీలో బీఆర్‌ఎస్‌ ‌కొట్టుకపోడం ఖాయం.. కేసీఆర్‌ ‌ను ఫాం హౌస్‌ ‌నుంచి బయటకు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌ ‌కు ప్రజలు బైబై చెపుతున్నారని ఏఐసీసీ నాయకులు కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహూల్‌ ‌గాంధీ పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మల్కాజిగిరిలో అభ్యర్ధి మైనంపల్లి హన్మంతరావుకు మద్దతుగా  నిర్వహించిన రోడ్‌ ‌షోలో సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆనంద్‌  ‌బాగ్‌  ‌నుంచి మల్కాజ్‌ ‌గిరి  చౌరస్తా వరకు పెద్ద ఎత్తున రోడ్‌ ‌నిర్వహించగా రోడ్డుకు ఇరువైపులా రాహూల్‌ ‌ప్రియాంకలు – ప్రజలకు అభివాదం చెపుతూ  నవ్వుతూ విక్టరీ చూపుతూ రోడ్‌  ‌షో ను నిర్వహించారు.  అనంతరం మల్కాజిగిరి (ఇందిరాచౌక్‌)‌లో నిర్వహించిన సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగిం చారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ప్రజలు ఆశించిన ఏ ఒక్క కోరిక నెరవేరలేదన్నారు. కేసీఆర్‌ ‌కుటుంబంలో మా త్రమే ఉద్యోగాలు వొచ్చాయని నిరుద్యోగులకు మాత్రం ఏమాత్రం ఉద్యోగాలు రాలేదని అన్నారు. రాష్ట్రంలో విషహరిత పాలన కొనసాగుతుందని ప్రజలు కెసీఆర్‌ ‌కుటుంబాన్ని పారదోలేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కేసీఆర్‌ ఇక బైబై చెపుతారా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ కి, రాష్ట్రంలో కేసిఆర్‌ ‌ను పారదోలాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం‌లు ఒక్కటేనన్నారు. నాపైన నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 24 కేసులు పెట్టిందని అయితే ఇటు కేసీఆర్‌ ‌మీద మాత్రం ఒక్కకేసైనా పెట్టిందా అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ ‌కు  పట్ణం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఈనెల 30న ప్రజలు చేతిగుర్తుపై వోటు వేయాలని కోరారు. ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ ఫాం హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌  ‌పారదోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ ‌మీకు ఈ పదేళ్ళలో ఏమైనా చేశారా.. ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చాడా.. మహిళలకు ఏమైనా ఇచ్చాడా. ఏమీ ఇవ్వలేదా. డబుల్‌ ‌బెడ్రూంలు ఎంత మందికి ఇచ్చారు. దళిత బందు ఎంతమందికి ఇచ్చారంటూ ప్రశ్నించారు. మీకు   ప్రజల సర్కార్‌ ‌కావాలా.. దొరల సర్కార్‌ ‌కావాలా అంటూ ప్రజల చేత మాకు ప్రజల సర్కార్‌ ‌కావాలి అని అనిపించారు. పది సంవత్సరాల కేసీఆర్‌ ‌పాలనలో కేవలం కేసీఆర్‌ ‌కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయ మైని రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేవని విమర్శించారు. మార్పురావాలి… కాంగ్రెస్‌ ‌రావాలి అంటూ ప్రజలచేత అనిపించారు. కేసీఆర్‌ ‌ఫాం హౌస్‌ ‌నుంచి పాలన చేస్తున్నది కేవలం కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌మాత్రమేనని ఇలాంటి పాలన మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇక కేసీఆర్‌ ‌కు బైబై చెపుతారా అంటూ వారితోనే కేసీఆర్‌ ‌బైబై అనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *