ఆ జాతరలు విజయవంతం..
ప్రజాతంత్ర : ప్రస్తుత 2024 మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతను కల్పించే ఈ మేడారం జాతర నిర్వహణలో దాదాపు 90 శాతం నిర్వహణధికారులు మహిళలే కావడం యాదృశ్చికం. జాతర ఏర్పాట్లను మొత్తం తన భుజాలపై వేసుకొని గత ఆరునెలల నుండి ప్రతిరోజూ స్వయంగా సమీక్షిస్తున్న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క ) అత్యంత ప్రధాన పాత్ర పోషించారు.

దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా, తాను, జ్వరం సోకి అస్వస్థతకు గురైనప్పటికి తన శాఖ అధికారులతో సమీక్షిస్తూ పలుమార్లు మేడారాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి గత అనుభవం లేనప్పటికీ ప్రతీ సూక్ష్మ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల ఈ మహా జాతర ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కొనసాగిందని చెప్పవచ్చు.

2008 జాతర కూడా మహిళా అధికారుల నేతృత్వం
అయితే, ప్రస్తుత జాతరతోపాటు, 2008 సంవత్సరంలో జరిగిన మేడారం జాతర కు ఇంతే, ప్రత్యేకత ఉంది. ఆ జాతరను విజయవంతంగా నిర్వహించిన అధికారులలో ముఖ్యమైన వారందరూ మహిళలు ఉండడం ప్రత్యేకత. 2008 లో జాతర నిర్వహణ బాధ్యతలో పాలుపంచుకున్న వారిలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అందరూ మహిళా అధికారులే ఉండడం గమనార్హం.

జిల్లా కలెక్టర్ దమయంతి, పోలీస్ సూపరింటెండెంట్ సౌమ్య మిశ్రా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ధన్వంతి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాకాధికారి, జిల్లా పంచాయితీ అధికారి పద్మజారాణి ఇలా అనేక శాఖలకు మహిళా అధికారులే ఉన్నారు. వీరందరి నేతృత్వంలో జాతర విజయవంతంగా ఏవిధమైన అవాంచనీయ సంఘటనలు లేకుండా నిర్వహించారు. అప్పుడు, తాడ్వాయి మండల పరిషద్ అధ్యక్షులుగా కూడా సమ్మక్క అనే మహిళనే ఉంది. వీరితోపాటు మరెందరో మహిళా అధికారులు ఆ 2008 జాతరలో విశేష సేవలందించారు. అందుకే , ఆ జాతరను ప్రత్యేక జాతరగా పేర్కొనవచ్చు.

మహిళా అధికారుల నేతృత్వంలో 2024 మేడారం మహా జాతర నిర్వహణ
2024 మేడారం జాతర మొత్తం మహిళల నేతృత్వంలోనే పకడ్బందీగా జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ జాతరలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
2024 మేడారం జాతర మొత్తం మహిళల నేతృత్వంలోనే పకడ్బందీగా జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ జాతరలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
*దనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర గిరిజన, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి.
*కొండా సురేఖ, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి.
*మాలోతు కవిత, మహబూబ్ బాద్ పార్లమెంటు సభ్యురాలు.
*బడే నాగ జ్యోతి, జిల్లా పరిషత్ ఛైర్మన్, ములుగు జిల్లా.
*ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్.
*చిత్రా మొహ్రా, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫిసర్.
*శ్రీజ, ములుగు అసిస్టెంట్ కలెక్టర్
*రాధికా గుప్తా, హన్మకొండ అడిషనల్ కలెక్టర్.
*ప్రతిమా సింగ్, అడిషనల్ కలెక్టర్.
*శ్రద్దా శుక్లా, ట్రైనీ కలెక్టర్.
*లేనీనా, జిల్లా సంక్షేమ అధికారి.
*బండి పల్లవి, పీఆర్ఓ.
*ఈవీ కిరణ్మయి, పీఆర్ఓ,
*హేమలత, గిరిజన సంక్షేమ శాఖ కార్య నిర్వాహక ఇంజనీరు.
*ఉష, సమాచార ఇంజనీరు.