కొత్తగూడెం: భద్రాద్రికొత్త గూడెం జిల్లా ఇంచార్జ్ జడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీరం పుచ్చుకొనున్నారు. తెలంగాణ ఉద్యకారునిగా పెరున్న కంచర్ల పొంగులేటి ప్రధాన అనుచరులలో ఒకరుగా ముద్రపడిన నేత. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది మొదలు కొత్తగూడెం నియోజకవర్గం నుండి గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన గుర్తింపు లభించలేదు. ఈనేపధ్యంలో రియల్ వ్యాపారంలో మునిగి తేలుతూ పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. పొంగులేటి ఎంట్రీతో ఆయన పంచన చేరారు కంచర్ల. అప్పటినుండి బిఆర్ఎస్ లో పొంగులేటి వర్గంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దీనితో భద్రాద్రి జిల్లాలో పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ పదవి సైతం కంచర్లను వరించింది.
పోంగులేటి పార్టీ నుండి బషిష్కరించడంతో అటు పార్టీని వీడితే లేటు వయస్సులో వచ్చిన పదవిని ఒదులుకో లేక ప్రియ నేత పొంగులేటి వెంట నడవలేని పరిస్థితి నెలకొంది. తన ప్రియతమ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. రాజకీయ పరిస్థితులను బట్టి పొంగులేటి పిలుపు కోసం కంచర్ల చంద్రశేఖర్ ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి నుండి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని విశ్వసనీయ సమాచారం. ఆయనతో పాలు ఎంపీటీసీలు, జడ్పిటిసీలు సైతం పెద్ద ఎత్తులో కాంగ్రెసులో చేరతారు అనే ప్రచారం సాగుతోంది. మంత్రి పొంగులేటి కొత్తగూడెం వస్తుండటంతో కంచర్ల పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. కంచర్ల వెంట తెలంగాణ ఉద్యమాకారుల తోపాటు మందళాలలోని ప్రజా ప్రతినిధులు కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ లోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.




