ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 10; చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హైదరాబాదులోని మెట్రో భవన్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించినారు.అప్ప జంక్షన్ నుండి చేవెళ్ల వరకు మెట్రో లైన్ విస్తరింప చేయాలని మంత్రికి విన్నవించారు.అలాగే నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే యాదన్న కోరినారు.



