Take a fresh look at your lifestyle.

భారత నిర్మాణంలో ఎపి కీలక భూమిక

విశాఖపట్టణం,మార్చి3: నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించ నుందని రిలయన్స్ అధినేత ముఖేష్‌ అం‌బానీ అన్నారు. శాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో రిలయన్స్ ‌సంస్థల అధినేత ముఖేష్‌ అం‌బానీ ప్రసంగించారు. విశాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో భాగస్వామ్యమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. రిలయన్స్ ‌సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ రాష్టాన్రికి చెందినవారున్నారని అన్నారు. తిరుపతి, విశాఖపట్టణం వంటి పట్టణాలతో పాటు అనేక సహజ వనరులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ముఖేష్‌ అం‌బానీ తెలిపారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీకి చెందినవారున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అం‌బానీ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్ 90‌శాతం కవర్‌ ‌చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి జగన్‌ ‌నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ‌శరవేగంగా అభివృద్ధి చెందుతోందని జిఎంఆర్‌ ‌గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు. ఇందుకు అనేక గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమా నాశ్రయం తరహాలో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌ ‌పోర్ట్ ‌ద్వారా లక్ష ఉద్యోగాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ‌లో పరిశ్రమల స్థాపనకు తరలిరావాలని జీఎంఅర్‌ ‌సైతం పిలుపునిస్తుం దన్నారు.

ఆంధప్రదేశ్‌లో మరో 5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు శ్రీ సిమెంట్స్.. ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌మోహన్‌ ‌బంగూర్‌ ‌తెలిపారు. కొత్త పెట్టుబడి ద్వారా 5000 మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా 1000 కోట్ల సహకారం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విజన్‌ ‌తో విద్యపై ఎక్కువ ఖర్చు చేస్తోందని  బివిఆర్‌ ‌మోహన్‌ ‌రెడ్డి అన్నారు. 1.12 లక్షల కోట్ల ను విద్యారంగం పై జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి వెచ్చించడం జగన్‌ ‌దూరదృష్టికి నిదర్శనం అననారు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌దేశానికి నాలెడ్జ్ ‌క్యాపిటల్‌ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. విశాఖలో సాంకేతిక రంగంలో రెండంకెల వృద్ది ని సాధిస్తామని ముఖ్యమంత్రికి హా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ ‌కృషి అభినందనీయమనిఅపోలో హాస్పిటల్స్ ‌వైస్‌ ‌చైర్‌పర్సన్‌ ‌ప్రీతారెడ్డి అన్నారు. ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు.ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్పార్‌ ‌సేవలను ప్రీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply