ఫెయిల్డ్‌ ‘ఆపరేషన్‌ లోటస్‌’

అనునిత్యం సత్యం, న్యాయం, ధర్మం అని  సమతా ప్రవచనాలు వల్లించే భారతీయ జనతా పార్టీ అందుకు విరుద్ధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని తనకు అనుకూలంగా లేని ఆయా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో అత్యుత్సాహాన్నీ ప్రదర్శించడం అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.   ‘కేంద్ర ప్రభుత్వం కావాలి అని దేశంలోని అనేక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని విజ్ఞులైన ప్రజలు సునిశితంగా పరిశీలిస్తున్నారు’ అనే విషయం జగమెరిగిన నగ్నసత్యం.  ప్రస్తుత ప్రతిపక్ష సభ్యులలో  అత్యధిక శాతం మంది సభ్యులు ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘానీడలో ఉండడం ‘ప్రజాస్వామ్యానికి కళంకం’గా అభివర్ణించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు తొక్కిపెట్టడం, మంత్రులను జైలులో పెట్టడం, ముఖ్యమంత్రులకు సమన్లు పంపడం, గవర్నర్ల ద్వారా మితిమీరి జోక్యం చేసుకోవడం, ప్రజాప్రతినిధుల  కొనుగోళ్ళకు కుట్రలు పన్నడం, పరోక్షంగా తమ పార్టీలోనే చేరాలి అంటూ రకరకాల వత్తిళ్ళకు  పాల్పడడం, పార్టీలను చీల్చడం, ఏకంగా ముఖ్యమంత్రులను మార్చడం, కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరచడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఇలా  రకరకాలుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కపట నాటకాలు ఆడదాన్ని ప్రజాస్వామిక పౌర సమాజం ఏమాత్రం అంగీకరించదు.

ఇటీవల  జార్కండ్‌  రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) పన్నిన కుట్ర మాత్రం ఘోరంగా విఫలం కాబడి చతికిలపడడం కళ్ళ ముందు చాలా సృష్టంగా కనబడడాన్ని గమనించవచ్చు. అలాగే మరో కొత్త తరహాలో చండిఘడ్‌  మేయర్‌ ఎన్నికల అనంతరం  ప్రిసైడిరగ్‌  అధికారి అనిల్‌ మాసీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి విజయం చేకూరేలా ఏకంగా బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసి కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడాన్ని  సైతం గమనించవచ్చు. ఈ రెండు ఘటనలు మరువక ముందే తాజాగా భారతీయ జనతా  పార్టీ  (బి.జె.పి)  దేశ రాజధాని  దిల్లీ లో  ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  విఫలయత్నం చేసి చివరకు చతికిలపడడం అప్రజాస్వామిక కుట్రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఆప్‌ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉన్ననూ  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  ఆప్‌ శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ ప్రలోభాలకు గురి చేయడం ఏమాత్రం సహేతుకం కానే కాదు. ఇలా అప్రజాస్వామిక కుట్రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ పాల్పడడం మూలంగానే దిల్లీ  మద్యం కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  తనను అరెస్ట్‌ చేయవచ్చు అనే వార్తల మధ్య ముందుగానే విశ్వాస పరీక్షను నిర్వహించాల్సిన విషమ పరిస్థితి తలెత్తడం  విచారకరం. ‘ దిల్లీ  మద్యం పాలసీ కేసు అబద్ధమని, కేవలం  ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏకైక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కుట్రాజకీయాలకు పాల్పడిరది’ అని అని దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సృష్టంగా ఆరోపించడం గమనార్హం.

 

ఆప్‌ ప్రభుత్వం అతి పెద్ద సవాలుగా ఉండటం వల్లే ఆ పార్టీపై అన్ని వైపుల నుంచి దాడి జరుపుతూ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ని అరెస్టు చేయాలని  భారతీయ జనతా పార్టీ కుట్రాజకీయాలకు పాల్పడడం నిజంగా ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా నిలుస్తుంది.  ఆప్‌ పార్టీకి చెందిన శాసన సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యులు సంప్రదించి ఒక్కొక్కరికి రూపాయలు 25 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసిననూ వారు  అంగీకరించకపోవడాన్ని సృష్టంగా గమనించవచ్చు. భారతీయ జనతా పార్టీ సభ్యులు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ను అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొడతామని,  త్వరలో దిల్లీ  ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయనున్నట్లుగా సృష్టమైన సంకేతాలు వెల్లడి అయినట్లుగా దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  పేర్కొనడం తద్వారా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న అసహేతుక అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతుంది అని చాలా సృష్టంగా  చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

‘కొందరు ఆప్‌ శాసన సభ్యులు పార్టీని వీడేందుకు నిరాకరించిననూ వారు అంగీకరించారు అని, మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ జనతా పార్టీ సభ్యులు అంతర్గతంగా పేర్కొన్నట్లుగా వార్తలు వెలువడడాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో  చిక్కుకుంది’ అని సృష్టంగా బోధపడుతుంది. ‘తనను అరెస్టు చేయడం ద్వారా  ఆప్‌ పార్టీని అంతమొందించవచ్చు అని భారతీయ జనతా పార్టీ కలలు కంటుంది అని, ఆ  కలలు కల్లలు గానే మిగిలిపోక తప్పదు’  అని దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎద్దేవా చేయడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ‘ఒకవేళ నన్ను అరెస్టు చేసిననూ నా  ఆలోచనలను అంతం చేయలేరు’ అని ఆయన  చాలా సృష్టంగా  పేర్కొనడం గమనార్హం.

గత శుక్రవారం అసెంబ్లీలో దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా  అది శనివారం సభలో చర్చకు వచ్చింది. ఆప్‌ పార్టీ సభ్యులకు శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికిని  భారతీయ  జనతా పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  విశ్వాస పరీక్షను కోరడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 62 మంది, బిజెపికి ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 54 మంది ఆప్‌ శాసన సభ్యులు హాజరై తీర్మానానికి మద్దతు తెలుపగా ‘ఈ తీర్మానం ఆమోదం పొంది ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది’ అని పేర్కొనవచ్చు. మొత్తంగా ఆప్‌ శాసన సభ్యులు తమ పార్టీకి అండగా ఉండడాన్ని సృష్టంగా గమనించవచ్చు. ఫలితంగా ‘ఆప్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మరోసారి విజయం సాధించి అప్రజాస్వామిక కుట్రాజకీయాలకు ఏమాత్రం స్థానం లేదు’ అని తేల్చి చెప్పడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్లో ఉన్నారు. సభలో లేని వారిలో కొందరు సభ్యులు జైలులో, ఇద్దరు అనారోగ్యంగా, మరో ఇద్దరు ప్రయాణంలో ఉండడం గమనార్హం. ఏది ఏమైననూ అంతిమంగా  ‘ఆపరేషన్‌ లోటస్‌’ ఫెయిల్డ్‌   కావడం మూలంగా ప్రజాస్వామ్యం పరిరక్షింపబడిరది’ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.  ఇకనైననూ భారతీయ  జనతా పార్టీ అప్రజాస్వామిక విధానాలను విడనాడి ప్రజాస్వా మ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-జె.జె.సి.పి.బాబూరావు,
రీసెర్చ్‌ స్కాలర్‌, సెల్‌: 9493319690

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *