ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర

డిజిపికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి కాంగ్రెస్‌ నేతలు  మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్‌ సెక్రెటరీలు కైలాష్‌ నేత, చారుకొండ వెంకటేష్‌, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ..‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల ఎమ్మెల్యేలు కుట్ర పన్ని ఒకరకమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేశాం. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కుట్రలకు తెరలేపారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం ఇచ్చాం. సమగ్రంగా అధ్యయనం చేయాలని డీజీపీని కోరాం. ప్రజలందరూ బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల వ్యాఖ్యలను గమనిస్తున్నారు’…అని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *