ప్రభాతాల ఉషోదయం
పలుకుతుంది స్వాగతం
వేకువ తెర తొలగిన మేర
పరుచుకున్న అరుణోదయ కాంతి ధార!
।।ప్రభాతాల।।
స్వాగతించే పక్షుల కిలకిల రావాలకు
కర్తవ్య పారాయణ జన-మునులకు
కాలచక్రగతుల వికసించే పరిమళాలకు.
మేలుకొలుపు మంగళ సుప్రభాతాలకు
।।ప్రభాతాల।।
చీకట్ల ను తొలగించే
పసిడి వర్ణ తొలి కిరణం
బ్రతుకులు వెలిగించే
కాలచక్ర భ్రమణం!
।।ప్రభాతాల।।
నీడలను కూడా మింగి వేసే
నిశి రాత్రులకు
వెలుగు జాడలను తెలిపే
వెనుకా ముందు బంటు నీడలకు
।।ప్రభాతాల।।
చీకటి వెలుగులతోనే రోజు
చీకటిలో వెలిగే రే రాజు
వెలుగుంటే చీకటి పరుగు
పగలంటేనే రవి వెలుగు!
।।ప్రభాతాల।।
కోటి ఆశల నిన్నటి కలలకు
రూపమిచ్చి నిజం చేసే నేటికి
మనసు గాయాల బాధలకు
లేపనమయ్యే ప్రశాంత ప్రాతః కాలానికి
।।ప్రభాతాల।।
ప్రభాతాల ఉషోదయం
పలుకుతుంది స్వాగతం
వేకువ తెర తొలగిన మేర
పరుచుకున్న అరుణోదయ కాంతి ధార!

ప్రభాతాల ఉషోదయం
పలుకుతుంది స్వాగతం!

  – పి.బక్కారెడ్డి, 9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *