Take a fresh look at your lifestyle.

పాడి అభివృద్దికి తెలంగాణకు రూ.540.10 కోట్లు

రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నకు మంత్రి సమాధానం
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్తి వివరాలను అందించారు. వాటి ప్రకారం.. పాడి పరిశ్రమకు సంబంధించిన నాలుగు రకాల పథకాల ద్వారా 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.540.10 కోట్లు కేటాయించినట్లు వెల్లడైంది. అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ రాష్ట్ర పాడిరంగం వికాసానికి భారీగానే బడ్జెట్‌ ‌ను కేటాయించినట్లు గణాంకాలను బట్టి స్పష్టమైంది.  2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.651.05 కోట్లు, 2020- 2021లో రూ.395.98 కోట్లు, 2021-2022లో రూ.542.91 కోట్లను కేంద్ర సర్కారు
తెలంగాణ పాడి రంగానికి సమకూర్చిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వివరించారు.

Leave a Reply